BigTV English

First Class Admission: ఇకపై ఆరేళ్లు నిండితేనే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్.. కేంద్రం సూచనలు

First Class Admission: ఇకపై ఆరేళ్లు నిండితేనే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్.. కేంద్రం సూచనలు

Centre to states Fix minimum age for class 1 admission at 6Central fixed minimum age for Class 1 Admission: నూతన విద్యావిధానాన్ని అనుసరించి ఇకపై ఒకటవ తరగతిలో అడ్మిషన్లు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను కోరింది. అన్ని రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ ఈ మేరకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. చిన్నారుల పునాది దశ విద్యాభ్యాసాన్ని బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని 2020 (national Education policy-2020) కు అనుగుణంగా ఈ సూచనలు పాటించాలని పేర్కొంది.


ప్రారంభ దశలో విద్యార్ధులకు 5 ఏళ్ల పాటు అభ్యాస అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. అందులో 3 నుంచి 8 సంవత్సరాల వయసు మధ్యలో పిల్లలకు 3 ఏళ్లు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత 1,2 తరగతులు ఉంటాయి. కొత్త విద్యా విధానం ప్రకారం.. పిల్లలు అభ్యసించే ప్రీ- స్కూల్ విద్యాభ్యాసం కూడా అధికార లెక్కల్లోకి వస్తుంది. ప్రీ- స్కూల్ నుంచి 2వ తరగతి వరకు ఎలాంటి అవాంతరాలు లేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించాలనేదే ఈ విధానం ముఖ్య ఉద్దేశం.

Read more: ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు.. కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ..


అంగన్ వాడీలు, ప్రభుత్వం, ఎయిడెడ్, ఎన్ జీవోలు నిర్వహించే ప్రీ స్కూల్ కేంద్రాల్లో 3 ఏళ్ల పాటు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చినప్పుడు ఇది సాధ్యమవుతుంది.

5+3+3+4 సిస్టమ్ ఇదే..

5(ఫస్ట్ స్టేజ్)-3 నుంచి 8 సంవత్సరాల వయసు- 3 ఏళ్ల ప్రీ స్కూల్, 1,2 వ తరగతులు
3(రెండో స్టేజ్)-8 నుంచి 11 సంవత్సరాల వయసు-3 నుంచి 5వ తరగతి.
3(మూడో స్టేజ్) – 11 నుంచి 14 సంవత్సరాల వయసు-6 నుంచి 8వ తరగతి.
4(నాలుగో స్టేజ్)-14 నుంచి 18 సంవత్సరాల వయసు-9 నుంచి 12వ తరగతి.(ఇంటర్)

Tags

Related News

EPFO Tagline Contest: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?

Earthquake: వణికిన ఫిలిప్పీన్స్.. 7.6 తీవ్రతతో భారీ భూకంపం

UP Governor: యూపీ గవర్నర్ వార్నింగ్.. సహజీవనం వద్దు, తేడా వస్తే 50 ముక్కలవుతారు

Tata Group: టాటా గ్రూప్‌లో కుంపటి రాజేస్తున్న ఆధిపత్య పోరు.. రంగంలోకి కేంద్రం..

Donald Trump: ప్రెసిడెంట్ ట్రంప్‌నకు యూఎస్ చట్టసభ సభ్యులు లేఖ

Narendra Modi: ఓటమి తెలియని నాయకుడు.. కష్టపడి పని చేసి, ప్రపంచానికి చూపించిన లీడర్..

Ayodhya: అయోధ్యలో మరో కీలక ఘట్టం.. బృహస్పతి కుండ్ ప్రారంభోత్సవానికి సిద్ధం

India Vs America: భారత్‌ను దెబ్బకొట్టేందుకు పాక్‌తో అమెరికా సీక్రెట్ డీల్స్..

Big Stories

×