BigTV English

Ratan Tata: బ్రేకింగ్ న్యూస్.. రతన్ టాటా ఆరోగ్యం విషమం?

Ratan Tata: బ్రేకింగ్ న్యూస్.. రతన్ టాటా ఆరోగ్యం విషమం?

Ratan Tata Health Condition: ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను ముంబైలోని ఓ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పలు జాతీయ మీడియా వార్తా కథనాలు తాజాగా వెల్లడవుతున్నాయి.


Also Read: ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం.. తీసుకున్న కీలక నిర్ణయాలివే..

అయితే, రతన్ టాటా ఆరోగ్యానికి సంబంధించి ఇటీవలే పలు వందతులు వెల్లువెత్తాయి. దీంతో ఆయనే స్వయంగా స్పందించి సోషల్ మీడియా వేదికగా సమాధానమిచ్చారు. తన ఆరోగ్యంపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. వృద్ధాప్యం కారణంగా తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లినట్లు, తాను బాగానే ఉన్నానంటూ అందులో వివరించారు. తన ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్లో ఎటువంటి నిజం లేదన్నారు.


రతన్ టాటాకు ప్రస్తుతం 86 ఏళ్లు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఈయనొకరు. ప్రముఖ దిగ్గజ కంపెనీ అయిన టాటా కంపెనీకి చైర్మన్ గా పనిచేశారు. 1991 నుంచి 2012 వరకు టాటా గ్రూప్ కు చైర్మన్ గా కొనసాగారు. ఆయన హయాంలో టాటా కంపెనీని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేశాడు. అంతేకాకుండా ప్రముఖ టెట్లీ, కోరస్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి ప్రధాన కంపెనీలను సైతం కొనుగోలు చేసింది. ఇలా క్రమక్రమంగా టాటా దేశీయ సంస్థ నుంచి గ్లోబల్ పవర్ హౌస్ గా మారింది.

ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు.. టాటా నానోను ఈయన హయాంలో ప్రవేశపెట్టారు. అదేవిధంగా దాని సాఫ్ట్ వేర్ సేవల విభాగం టాటా కన్సల్టెన్సీ -టీసీఎస్ ను ప్రపంచ ఐటీ అగ్రగామీగా విస్తరింపజేశారు.

Also Read: ఇద్దరు ఆర్మీ జవాన్లను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు.. ఒకరిని చంపేసి…

ఆ తరువాత 2012లో చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఆ తరువాత టాటా సన్స్ మరియు టాటా మోటార్స్, టాటా స్టీల్ తో సహా ఇతర గ్రూప్ కంపెనీలకు చైర్మన్ ఎమెరిటస్ గా ఎంపికయ్యారు.

ఇటు సేవా కార్యక్రమంలోనూ రతన్ టాటా ఎప్పుడూ ముందుంటారు. తన కంపెనీకి వచ్చిన లాభాల్లో సగానికి పైగా సేవా కార్యక్రమాల కోసం ఖర్చుపెడుతుంటారు. ఇటు తన కంపెనీలో పనిచేస్తున్న వారిని ఉద్యోగులు కాకుండా తన కుటుంబ సభ్యుల వలే చూసుకుంటారని రతన్ టాటాకు మంచి పేరుంది. ఎన్నో విధాలుగా పేద కుటుంబాలకు, పేద పిల్లలకు ఆయన హెల్ప్ చేస్తుంటారు.

కోవిడ్ సమయంలో దేశ ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఏ కంపెనీ కూడా ఈయనలా సేవా కార్యక్రమాలు చేపట్టలేదు. ఎంతోమందిని ఆ సమయంలో ఆదుకున్నారు. ఇటు ప్రభుత్వాలకు కూడా ఆర్థికంగా సపోర్ట్ చేశారు. అందుకే.. దేశ ప్రజలకు ఆయనన్నా.. ఆయన ప్రొడక్ట్స్ అన్నా కూడా చాలా ఎక్కువగా అభిమానిస్తుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయనకు పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందజేసి ఘనంగా సత్కరించాయి. పలు దేశాలకు ఈయన సేవలను కొనియాడుతుంటాయి.

ఈ క్రమంలో ఆయన ఆరోగ్యంపై ఈ వదంతులు రావడంతో దేశవ్యాప్తంగా ప్రముఖులు, ప్రజలు ఆందోళన చెందారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉంది..? ఏ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు? అనే వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×