BigTV English

SSMB29: మహేష్ కాబట్టే కథ లేట్ అయ్యింది.. విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

SSMB29: మహేష్ కాబట్టే కథ లేట్ అయ్యింది.. విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

SSMB29: తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు పాన్ ఇండియా ప్రేక్షకులు మొత్తం ఎదురుచూస్తున్న సినిమా SSMB29. దర్శక ధీరుడు  రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాపై  అభిమానులు ఎన్నో ఆశలు, అంచలనాలను పెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన తరువాత రాజమౌళి  చేస్తున్న  సినిమా కావడం ఒక కారణం  అయితే.. మహేష్ తో మొదటిసారి జక్కన్న సినిమా చేయడం ఇంకొక కారణం అని చెప్పాలి.


మహేష్ కట్ అవుట్ కు జక్కన్న కథ తోడైతే.. మరో పాన్ ఇండియా హిట్ గ్యారెంటీ.  ఇక ఇప్పటికే  ఒకపక్క మహేష్ కోసం కథను జక్కన్న చెక్కుతున్నాడు. స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నాడు. అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ మొత్తం మార్చేశాడు. గుబురు గడ్డం.. లాంగ్ హెయిర్, ఫుల్ బాడీ ఫిట్ తో కనిపిస్తున్నాడు. ఇక గత రెండేళ్లుగా  ఈ సినిమా గురించి ఒక్క అప్డేట్ ను మేకర్స్  ఇచ్చింది లేదు.

అప్పుడప్పుడు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ మాత్రమే ఏదో ఒక ఈవెంట్ లో పాల్గొన్నప్పుడు.. SSMB29 గురించి అభిమానులకు అప్డేట్ ఇస్తూ ఉంటాడు. ఇక తాజాగా ఒక ఈవెంట్ లో విజయేంద్ర ప్రసాద్.. SSMB29 ఎప్పుడు మొదలుకానుందో చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా సెట్స్ మీదకు వస్తుందని తెలిపాడు. అంతేకాకుండా ఇన్నేళ్లు కథను రెడీ చేయడానికి టైమ్ ఎందుకు పట్టిందో కూడా తెలిపాడు.


” సాధారణంగా ఏ హీరోకు అయినా  3-4 వారాలనే స్టోరీ రాసేవాళ్లం.  మహేష్ లాంటి స్టార్ హీరో కోసం స్టోరీ చేయడానికే రెండేళ్లు పట్టింది.  సంక్రాంతి 2025 లో SSMB29 సెట్స్ మీదకు వెళ్తుంది” అని చెప్పుకొచ్చాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి కచ్చితంగా SSMB29 అప్డేట్ ఉంటుందని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాతో రాజమౌళి – మహేష్ బాబు ఎలాంటి రికార్డులను బద్దలుకొట్టనున్నారో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×