Ravneet Singh Bittu: కేంద్ర సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఇప్పటివరకు ఆయన కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమలు, రైల్వే శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించారు. రాజ్యసభ ఎంపీగా ఆయన పదవీకాలం ముగియడంతోనే నిబంధనల ప్రకారం ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
పంజాబ్ రాజకీయాల్లో సుపరిచితుడైన రవ్‌నీత్ సింగ్, వచ్చే ఏడాది అక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సమాయత్తమవుతున్నట్లు సమాచారం. పంజాబ్‌లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంలో ఆయన మొదటినుంచీ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాబోయే ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలంగా నిలబెట్టేందుకు, పంజాబ్ రాజకీయాలపై పూర్తి దృష్టి సారించాలనే ఉద్దేశంతోనే ఆయన కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Also Read: NTA లో ఊచకోత.. 47 మంది అధికారుల తొలగింపు.. క్రిమినల్ కేసులు నమోదు!