BigTV English

Chandrayaan : చంద్రయాన్‌-2 వైఫల్యానికి కారణాలివే.. ఈసారి పక్కాగా ప్రయోగం..

Chandrayaan : చంద్రయాన్‌-2 వైఫల్యానికి కారణాలివే.. ఈసారి పక్కాగా ప్రయోగం..

ISRO Chandrayaan 3 launch live updates(Telugu breaking news today): ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకం 2019లో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం ఆఖరి క్షణంలో విఫలమైంది. అప్పటి వైఫల్యానికి అనేక కారణాలున్నాయి. అప్పుడు సెకనుకు 2 మీటర్ల వేగాన్ని తట్టుకునేలా ల్యాండర్‌ను తయారు చేశారు. చంద్రుడి ఉపరితలంపై ల్యాండింగ్‌ కోసం 500 X 500 మీటర్ల ప్రదేశాన్ని ఎంచుకున్నారు. దీంతో చంద్రుడిపైకి చేరుకోవడం ల్యాండర్‌కు కష్టమైంది.


అప్పుడు చంద్రుడి ఉపరితలంపై అనువైన ప్రదేశంలో దిగేలా మార్గనిర్దేశం చేసేందుకు ఒక్క హజార్డ్‌ డిటెక్షన్‌ అండ్‌ అవాయిడెన్స్‌ కెమెరా మాత్రమే ఉంది. ఇంధన పరిమాణ పరిమితులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఉపరితలంపై దిగే క్రమంలో ల్యాండర్‌ వేగాన్ని అంచనా వేయడంలో సమస్యలు తలెత్తాయి. చంద్రయాన్ -2లో మోడలింగ్‌ ఆధారంగా అల్గోరిథమ్‌ ఏర్పాటు చేశారు.

చంద్రయాన్‌-2 ల్యాండింగ్‌ సమయంలో వేగాన్ని తగ్గించడంలో ఇంజన్లు, సాఫ్ట్‌వేర్‌ పరంగా ఇబ్బందులు తలెత్తాయి. ఆఖరి క్షణాల్లో అనూహ్యంగా ఇతర సమస్యలు ఎదురయ్యాయి. ఈ ఇబ్బందులు పరిగణనలోకి తీసుకుని చంద్రయాన్ -3లో జాగ్రత్తలు తీసుకున్నారు.


చంద్రయాన్ -3లోని ల్యాండర్‌ కు సెకనుకు 3 మీటర్ల వేగాన్ని తట్టుకోగల సామర్థ్యం ఉంది. చంద్రుడి ఉపరితలాన్ని బలంగా తాకినా తట్టుకునేలా ల్యాండర్‌ కాళ్లు డిజైన్‌ చేశారు. చంద్రుడిపై ల్యాండింగ్ కోసం 4X2.5 కిలోమీటర్ల ప్రదేశాన్ని ఎంచుకున్నారు. తొలుత 500X500 మీటర్ల ప్రదేశంలో దిగడానికి ల్యాండర్‌ ప్రయత్నిస్తుంది. ఆ ప్రదేశంలో కుదరకపోతే 4X2.5 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా చంద్రుడిపై దిగుతుంది. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేశారు.

ఈసారి 2 హజార్డ్‌ డిటెక్షన్‌ అండ్‌ అవాయిడెన్స్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆర్బిటర్‌, మిషన్‌ కంట్రోల్‌తో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఇందులో ఇంధన పరిమాణాన్ని పెంచారు. ల్యాండర్‌లోని ఉపరితలాలపై సౌరఫలకాలను పెంచారు. దీంతో చంద్రుడిపై ఏ ప్రదేశంలో దిగినా సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి అవుతుంది. చంద్రుడిపై దిగేటప్పుడు ల్యాండర్‌ వేగాన్ని ఎప్పటికప్పుడు కచ్చితంగా అంచనా వేసేందుకు లేజర్‌ డాప్లర్‌ వెలోసీమీటర్‌ ఏర్పాటు చేశారు.

టెస్ట్‌ డేటా ఆధారంగా చంద్రయాన్-3లో అల్గోరిథమ్‌లను రూపొందించారు. ల్యాండర్‌ సురక్షితంగా చంద్రుడిపై దిగేందుకు యాక్సెలెరోమీటర్‌, ఆల్టీమీటర్‌, ఇంక్లినోమీటర్‌, టచ్‌డౌన్‌ సెన్సర్‌, అవరోధాలు తప్పించుకోవడానికి కెమెరా ఏర్పాటు చేశారు.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×