BigTV English

Janasena : జనసేనలోకి పంచకర్ల.. ముహూర్తం ఫిక్స్..!

Janasena : జనసేనలోకి పంచకర్ల.. ముహూర్తం ఫిక్స్..!

Janasena latest updates(Political news in AP) : వైసీపీకి రాజీనామా చేసిన పెందుర్తి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రెండు,మూడు రోజుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలవబోతున్నానని ఆయనే స్వయంగా తెలిపారు. జనసేన నేతలతో చర్చలు తర్వాత పార్టీలో చేరే అంశంపై అధికారికంగా ప్రకటన చేస్తానని స్పష్టం చేశారు. అభిమానులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


ఈ నెల 17న పంచకర్ల జనసేన కండువాకప్పుకుంటారని తెలుస్తోంది. నిన్నటి వరకు ఆయన విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. గురువారమే ఆ పార్టీకి షాకిచ్చారు. పార్టీ అధ్యక్ష పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి తొలిసారిగా పెందుర్తి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీలో చేరి ఎలమంచలి నుంచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. గత ఎన్నికల్లో అక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

2021 ఆగస్టులో పంచకర్ల వైసీపీలో చేరారు. ఆ తర్వాత ఆయనకు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో పెందుర్తి నుంచి బరిలోకి దిగాలని ఆయన భావించారు. అయితే వైసీపీ అధిష్టానం నుంచి టిక్కెట్ పై హామీ రాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీలో చేరి రెండేళ్లు గడవక ముందే వైసీపీకి గుడ్ బై చెప్పారు.


Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×