BigTV English

Kidnap : హైదరాబాద్ లో బీజేపీ నేత కిడ్నాప్.. ఆ ఎమ్మెల్యే అనుచరులపైనే అనుమానం..!

Kidnap : హైదరాబాద్ లో బీజేపీ నేత కిడ్నాప్.. ఆ ఎమ్మెల్యే అనుచరులపైనే అనుమానం..!

BJP leader kidnapped in telangana(TS news updates): హైదరాబాద్ లో బీజేపీ నేత కిడ్నాప్ నుకు గురికావడం సంచలనం సృష్టిస్తోంది. జనగామ జిల్లాకు చెందిన ముక్కెర తిరుపతి రెడ్డిని కొందరు వ్యక్తులు అపహరించారు. హైదరాబాద్‌ అల్వాల్‌లో తన భర్తను కిడ్నాప్ చేశారని ఆయన భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ భూమిని కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తిరుపతిరెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు.


అల్వాల్‌ పోలీసుల కథనం ప్రకారం కుషాయిగూడలో తిరుపతిరెడ్డి నివాసం ఉంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. ఓల్ట్‌ అల్వాల్‌ పాకాల కుంటలో ఆయనకు రూ.కోట్లు విలువ చేసే స్థలం ఉంది. కొన్నాళ్ల క్రితం ఈ స్థలంపై వివాదం తలెత్తింది. ఆ సమయంలో తిరుపతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గురువారం మధ్యాహ్నం తిరుపతిరెడ్డి కారులో డ్రైవర్‌తో కలిసి అల్వాల్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లారు.డ్రైవర్‌ పని మీద బయటకు వెళ్లాడు. డ్రైవర్ తిరిగి వచ్చే సరికి తిరుపతిరెడ్డి కనిపించలేదు. తిరుపతిరెడ్డి రెండు ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌లో ఉన్నాయి. దీంతో తిరుపతిరెడ్డి భార్య సుజాత అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థల వివాదం నేపథ్యంలోనే తన భర్తను కిడ్నాప్‌ చేశారని పేర్కొన్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారం పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కు చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరులే ఈ కిడ్నాప్ నకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి.


Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×