E-Paper
Advertisement

Republic Day : రిపబ్లిక్ డే వేడుకలకు సర్వం సిద్ధం.. ఈసారి ప్రత్యేకతలివే..?

Republic Day : రిపబ్లిక్ డే వేడుకలకు సర్వం సిద్ధం.. ఈసారి ప్రత్యేకతలివే..?
Advertisement

Republic Day : 74వ భారత్ గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ సారి రిపబ్లిక్‌ డే పరేడ్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌ లో జరిగే ఈ వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా అల్‌ సిసి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రిపబ్లిక్‌ డే పరేడ్‌కు సంబంధించిన టికెట్లను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. గురువారం ఉదయం 10.30 గంటలకు ఈ పరేడ్‌ విజయ్‌ చౌక్‌ వద్ద ప్రారంభమై ఎర్రకోట వరకు సాగుతుంది. రిపబ్లిక్‌ డే లో ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ ఆయుధాలను ప్రదర్శిస్తారు. ఆర్మీకి చెందిన నాలుగు బృందాలు, వాయుసేన, నేవీకి చెందిన ఒక్కో బృందం పరేడ్ లో పాల్గొంటాయి. సంప్రదాయ 21 గన్‌ సెల్యూట్‌కు ఉపయోగించే పురాతన బ్రిటిష్‌ పౌండర్‌ గన్స్‌ స్థానంలో 105 ఎంఎం ఇండియన్‌ ఫీల్డ్‌ గన్స్‌ ను ఈసారి ఉపయోగిస్తారు. ఈజిప్ట్‌ నుంచి వచ్చిన ప్రత్యేక సైనిక పటాలం ఈ పరేడ్‌లో పాల్గొంటుంది. కొత్తగా సైన్యంలో చేరిన అగ్నివీరులు ఈ పరేడ్‌లో భాగస్వాములవుతారు.

నారీశక్తి ప్రదర్శన..
ఆర్మీ సిగ్నల్‌ కోర్‌, ఎయిర్‌ డిఫెన్స్‌, ఆర్మీ డేర్‌ డెవిల్స్‌ విభాగాల నుంచి మహిళా అధికారులు మార్చ్‌లో పాల్గొంటారు. ఆకాశ్‌ క్షిపణుల విభాగానికి లెఫ్టినెంట్‌ చేతన శర్మ నేతృత్వం వహిస్తారు. బీఎస్‌ఎఫ్‌ క్యామెల్‌ కంటెజెంట్‌లోని మహిళా సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ‘నారీశక్తి’ ప్రదర్శనలో భాగంగా నేవీలో 144 సెయిలర్స్‌ బృందానికి మహిళా అధికారిణులు నేతృత్వం వహిస్తారు.

Advertisement

హైలెట్స్..
రిపబ్లిక్ డే పరేడ్‌ కోసం నేవీకి చెందిన ఐఎల్‌-38 విమానం చివరిసారిగా గాల్లోకి ఎగరనుంది. ఈ విమానం 42 ఏళ్లుగా నౌకాదళానికి సేవలు అందించింది. రిపబ్లిక్‌ డే ఫ్లైపాస్ట్‌లో మొత్తం 44 విమానాలు పాల్గొంటాయి. 9 రఫేల్‌ జెట్‌ విమానాలు, దేశీయంగా తయారు చేసిన తేలికపాటి అటాక్‌ హెలీకాప్టర్లు ఫ్లైపాస్ట్‌లో పాల్గొంటాయి.

రాష్ట్రపతి ప్రసంగం..
రిపబ్లిక్ డేకు ముందురోజు ఏటా రాష్ట్రపతి మాట్లాడటం ఆనవాయితీగా వస్తోంది. 74వ రిపబ్లిక్ డేను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి తన సందేశాన్నిఇస్తారు. రిపబ్లిక్ డే రోజు ప్రధాని మోదీ వేడుకల్లో పాల్గొని ప్రసంగిస్తారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×