BigTV English

Robot Elephant: దేవుడికి రోబో ఏనుగు సేవలు.. ఎక్కడంటే?

Robot Elephant: దేవుడికి రోబో ఏనుగు సేవలు.. ఎక్కడంటే?

Robot Elephant: టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ అన్ని రంగాల్లోకి రోబోలు వస్తున్నాయి. మనుషులు గంటల్లో చేసే పనిని చిటికెలో చేసి చూపెడుతున్నాయి. ఇప్పటికే పలు రెస్టారెంట్లతో పాటు కొన్ని చోట్ల రోబోలను వినియోగిస్తున్నారు. ఇక దేవుడికి సేవ చేయడానికి ఆలయాల్లో కూడా రోబోలు అందుబాటులోకి వచ్చాయి. కేరళలోని ఓ ఆలయంలో దేవుడికి సేవచేయడానికి రోబో ఏనుగును వినియోగిస్తున్నారు. ఆ రోబో ఆలయానికి వచ్చే భక్తులను ఎంతగానో ఆకట్టుకుటుంది.


కేరళ త్రిసూర్‌లోని ఇరింజలకుండ శ్రీకృష్ణ ఆలయంలో ఈ రోబో ఏనుగును ఏర్పాటు చేశారు. సినీ నటుడు పార్వతీ తిరువోతు సహాయంతో పెటా ఇండియా సభ్యులు ఆలయానికి ఈరోబోను అందజేశారు. రోబోకు ఇరింజడపిల్లి రామన్‌గా పేరు పెట్టారు. ఎత్తు11 అడుగులు, బరువు 800 కిలోలు. ఒకేసారి నలుగురు వ్యక్తులను ఈ ఏనుగు మోసుకెళ్లగలదు.

అచ్చం నిజం ఏనుగులా కనిపించే ఈ గజరాజు తల, నోరు, కళ్లు, చెవులు, తోక.. అన్నీ విద్యుత్‌తో పని చేస్తాయి. ఐరన్ ఫ్రేమ్స్, రబ్బర్ కోటింగ్‌తో ఈ ఏనుగును తయారుచేశారు. ఈ ఏనుగు నిజం ఏనుగులాగే తొండం ఊపుతుంది, చెవులను కదుల్చుతుంది. ఓ బటన్ నొక్కగానే తొండంతో నీళ్లు విరజిమ్ముతుంది. ఇలాంటి పనులు చేసేందుకు ఏనుగులోపల ఎలక్ట్రానికి మోటార్లను అమర్చారు. ఏనుగులను హింసించడాన్ని నిరోధించే క్రమంలో ఈ రోబో ఏనుగు ఒక వినూత్న ముందడుగుగా భావిస్తున్నామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు


ఆచారాలు, ఉత్సవాలు సమయాల్లోనే ఈ ఏనుగును ఉపయోగాలని ఆలయాధికారులు ఆదేశించారు. మరే ఇతర ప్రయోజనాల కోసం ఏనుగులను మరే ఇతర జంతువులను వినియోగించకూడదని.. అద్దెకు కూడా తీసుకోవద్దని పిలుపునిచ్చారు. అలాగే ఆలయాల్లో ఏనుగులను పోషించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని .. వాటితో కొన్నిరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. గత 15 ఏండ్లలో ఏనుగుల వల్ల 526 మంది మరణించాలని హెరిటేజ్‌ యానిమల్‌ టాస్క్‌ఫోర్స్‌ గణాంకాలు వెల్లడించాయి.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×