BigTV English

Mohan Bhagwat RSS : ఇతర మతాల దైవాలను అవమానించడం సరికాదు.. మసీదు వివాదాలు ఇక చాలు.. ఆర్ఎస్ఎస్

Mohan Bhagwat RSS : ఇతర మతాల దైవాలను అవమానించడం సరికాదు.. మసీదు వివాదాలు ఇక చాలు.. ఆర్ఎస్ఎస్

Mohan Bhagwat RSS | దేశంలో తీవ్రమవుతున్న ‘మసీదు కింద దేవాలయం’ వివాదాల పై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధ్యక్షుడు మోహన్ భాగవత్ స్పందించారు. మతం పేరుతో అనవసరంగా వివాదాలు చేయడం, ఇతర మతాల దైవాలను, వారి సంస్కృతిని అమమానించడం, కించపరచడం హిందూ సంప్రదాయం కాదని మోహన్ భాగవత్ అన్నారు. దేశంలో ఇటీవలి కాలంలో అయోధ్య రామ మందిరం తరహా వివాదాలు చేయడాన్ని ఖండించారు. దేశంలో ప్రతి ఒక్కరు తమకు ఇష్టమైన దైవాన్ని ఆరాధించడం, వారి దైవాన్ని పూజించడానికి హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు.


అయోధ్య రామ మందిరం హిందువుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని, ఆ మందిరం నిర్మించడం హిందువుల నమ్మకానికి ప్రతీక అన్ని ఉదహరిస్తూ.. ఇలాంటిదే ప్రతి చోట చేయడం వల్ల సమాజంలో ద్వేషం, శత్రుత్వ భావాలు పెరుగుతాయని.. అందుకే ఇలాంటి ఘటనలు ఏమాత్రం అమోదించకూడదని భాగవత్ అన్నారు.

మహారాష్ట్రలోని పుణెలోఆయన విశ్వగురు భారత్ అనే అంశంపై ఆయన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో భాగంగా ఆరాధనా స్థలాల గురించి కొత్త వివాదాలు రేకెత్తడంపై ఆయన మాట్లాడారు. ఉత్తర్ ప్రదేశ్ సంభల్ జిల్లాలోని షాషి జామా మసీదు, రాజస్థాన్ లోని అజ్మేర్ షరీఫ్ దర్గాల వివాదాలను తప్పుబట్టారు.


Also Read: దేశంలో జోరుగా సాగుతున్న కొత్త బిజినెస్.. ప్రేమ వివాహాలే టార్గెట్

భారతదేశంలో విభిన్న మతాలకు చెందినవారు కలిసిమెలిసి శాంతియుతంగా జీవిస్తున్నారని.. ఇదే మన దేశానికి అసలైన గుర్తింపు అని వ్యాఖ్యానించారు.

చరిత్రలో జరిగిన తప్పిదాల నుంచి అందరూ నేర్చుకోవాలి
భారతీయులందరూ తమ గతంలో, దేశ చరిత్రలో జరిగిన తప్పులను గుర్తించి తెలుసుకొని వాటి నుంచి ఎంతో నేర్చుకోవాలని భాగవత్ సూచించారు. తప్పులను సరిదిద్దుకోవడం మళ్లీ వాటిని చేయకుండా జాగ్రత్తపడితే.. ప్రపంచానికే మన దేశం ఆదర్శంగా మారుతుందన్నారు. విభేదాలు మరిచి అన్ని మతాలను కలుపుకొని ముందుకు సాగడం అందుకు చాలా అవసరమన్నారు.

“అతివాదం, బలప్రయోగం, ఇతర మతాల దైవాలను అవమానించడం మన సంస్కృతి కాదు. ఇక్కడ మెజారిటీ, మైనారిటీ అనే విభేదాలు రాకూడదు. ప్రపంచ శాంతి కోసం భారత దేశం చాలా పెద్దపెద్ద ప్రకటనలు చేస్తోంది. అయినా యుద్ధాలు ఆగడం లేదు. అలాంటిది మన దేశంలో మైనారిటీలను అణచివేసే ఘటనల గురించి తరుచూ వింటున్నాం. మన దేశంలో కంటే ఇతర దేశాల్లో మైనారిటీల పరస్థితి ఎంత దారుణంగా ఉందో చూస్తూనే ఉన్నాం.” అని పరోక్షంగా బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగే దాడులను ఆయన ప్రస్తావించారు.

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×