BigTV English

Wedding Detectives : దేశంలో జోరుగా సాగుతున్న కొత్త బిజినెస్.. ప్రేమ వివాహాలే టార్గెట్

Wedding Detectives : దేశంలో జోరుగా సాగుతున్న కొత్త బిజినెస్.. ప్రేమ వివాహాలే టార్గెట్

Wedding Detectives | భారతదేశంలో పెళ్లిళ్ల బిజినెస్ చాలా పెద్దది. సినిమాలు, క్రికెల్ తరువాత మూడో అతిపెద్ద వ్యాపారం.. వెడ్డింగ్ బిజినెస్. ఒక్క పెళ్లి జరిగితే.. అందులో క్యాటరింగ్, డెకరేషన్, బట్టలు, కల్యాణ మండపాలు ఇలా ఎన్ని రంగాల వారికి ఆదాయం వస్తుంది. అయితే పెళ్లి అనగానే అందరూ కోరికలు, పరువు కోసం పాకులాడుతూ ఎంతైనా ఖర్చుపెడతారు. కానీ పెళ్లి జరిగాక అసలు తంతు ప్రారంభమవుతుంది. భార్యభర్తలు కలిసి జీవితాంతం ఉండాలి. ఇది ఇప్పుడు పెద్ద సవాల్ గా మారింది. ఎందుకంటే చాలా మంది దంపతుల మధ్య భేదాభిప్రాయాల కారణంగా గొడవలు జరగుతున్నాయి. లేదా పెళ్లికి ముందు చెప్పిన విషయాలు అబద్ధమని, మోసమని తెలిసి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అందుకే ఈ సమస్యలకు కొంతవరకు నివారించడానికి ఒక కొత్త బిజినెస్ పుట్టుకొచ్చింది. అదే వెడ్డింగ్ డిటెక్టివ్స్.


దేశ రాజధాని ఢిల్లీలోని న్యూ ఢిల్లీ మాల్ లో ఒక ఆఫీసు ఉంది. ఆ ఆఫీసులో అందరూ మాట్రిమోనియల్ డిటెక్టివ్స్. ఆ ఆఫీసు ఓనర్ భావన పాలివాల్. పెళ్లి చేసుకోబోయే యువతి, యువకుల గురించి సమాచారం సేకరించడమే ఈ ఆఫీసులో అందరి పని. వివాహాల బిజినెస్ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సంప్రదాయ పెళ్లిళ్లతో పాటు, ప్రేమ వివాహాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది.

Also Read: అత్తారింటికి బయలుదేరిన కొత్త పెళ్లికొడుకు.. దారిలో కిడ్నాప్, హత్య.. కుట్ర ఎవరిదంటే?


అయితే పెద్దలు కుదిర్చిన వివాహాల్లో ఇరు కుటుంబాల పెద్దలు తమ పిల్లల కోసం చాలా జాగ్రత్తగా వరుడు లేదా వధువుని సెలెక్ట్ చేస్తారు. అయితే దేశంలో ఇప్పుడు యువత తాము చేసుకునే పెళ్లికి భాగస్వామిని కూడా తామే ఎంచుకునే హక్కు ఉందని వాదిస్తున్నారు. అందుకే స్వతహాగా మ్యాటిమోనీలో వివాహాల కోసం యాడ్ ఇస్తున్నారు. కానీ అవతలి వ్యక్తి గుణం ఎలాంటిది, ఆర్థిక స్థిరత్వం ఉందా? అతను లేదా ఆమె ఇచ్చిన సమాచారం సరైనదేనా? అని ధృవీకరించుకోవడం కూడా చాలా అవసరంగా మారింది.

అందుకోసమే ఒక వ్యక్తితో పెళ్లి చేసుకోవాలంటే ముందుగా ముహూర్తం కోసం పంతులుని పిలవకుండా భావన పాలివాల్ లాంటి వెడ్డింగ్ డిటెక్టివ్స్ ని సంప్రదిస్తున్నారు. హై ఎండ్ టెక్నాలజీ టూల్స్ సాయంతో ఈ వెడ్డింగ్ డిటెక్టివ్స్ ఆధారాల సేకరిస్తున్నారు.

ఉదాహరణకు న్యూ ఢిల్లీలో ఒక ఆఫీసులో ఉద్యోగం చేసే మహిళ తన కూతురి పెళ్లి చేయాలను కుంది. కానీ ఆమ కూతురు తన బాయ్ ఫ్రెండ్ ని తీసుకువచ్చి.. తననే పెళ్లి చేసుకుంటానని తన తల్లి షీలాకు చెప్పింది. దీంతో షీలా వెంటనే భావన పాలివాల్ ను సంప్రదించింది. తన కూతురు బాయ్ ఫ్రెండ్ గురించి మొత్తం సమాచారం సేకరించాలని చెప్పింది.

దీని గురించి షీలా మాట్లాడుతూ.. “నాకు పెళ్లి తరువాత భర్తతో గొడవలు రావడంతో ఇద్దరం విడిపోయాం. అందుకే నా కూతురు జీవితం నాలా కాకూడని జాగ్రత్త పడుతున్నాను. నా కూతురు ఒక వ్యక్తిని తీసుకొచ్చి తనను ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకుంటాను అంటే ఆమె సంతోషం కోసం నేను అంగీకరిస్తాను. కానీ ఆమె బాయ్ ఫ్రెండ్ ఎలాంటి వాడో నాకు తెలియాలి కదా? అందుకే వెంటనే అంగీకరించకుండా నాకు కాస్త సమయం కావాలని చెప్పి ఈ వెడ్డింగ్ డిటెక్టివ్స్ ని సంప్రదించాను. ఈ విషయం మా అమ్మాయికి తెలియదు. అన్నీ సవ్యంగా ఉంటేనే పెళ్లి చేయాలని ముందుగానే ధృవీకరణ కోసం ఇలా చేస్తున్నాను” అని చెప్పింది.

భావన పాలివాల్ (48)కి తేజాస్ డిటెక్టివ్ ఏజెన్సీ ఉంది. ఆమె గత 20 సంవత్సరాలుగా ఈ బిజినెస్ చేస్తోంది. అయితే కొన్ని సంవత్సరాల క్రితమే వెడ్డింగ్ డిటెక్టివ్స్ పని ప్రారంభించింది. ప్రతినెలా వధువు, వరుడు బ్యాక్ గ్రౌండ్ చెక్ కోసం తమ వద్ద ఇలాంటి 7-8 కేసులు వస్తున్నాయని తెలిపింది. తాజాగా ఒక కేసులో పెళ్లికి ముందు ఒక వరుడు తన నెల జీతాన్ని 10 రెట్లు ఎక్కువ చేసి చెప్పాడు. కానీ మేము అతని సాలరీ గురించి చెక్ చేస్తే.. అంత అబద్ధమని తేలింది.

సమాజ సేవ కోసం
తేజాస్ డిటెక్టివ్ ఏజెన్సీ ఓనర్ భాతన పాలివాల్ మాట్లాడుతూ.. “ఇది చాలా శ్రద్ధతో, జాగ్రత్తతో చేయాల్సిన పని. అందుకే పెళ్లి ముహార్తాల పేరుతో ఈ బిజినెస్ రహస్యంగా నడుపుతున్నాము. మా వద్దకు వచ్చే చాలా మంది ఎదుటి వారి గురించి విచారణ చేస్తున్నట్లు కూడా బయటికి చెప్పడానికి ఇష్టపడరు. అందుకే రహస్యంగా చేయాల్సి ఉంటుంది. కాబోయే వరుడు లేదా వధువు గురించి చెకింగ్ చేయాలంటే రూ.9000 నుంచి రూ.1,90,000 వరకు అవుతుంది. అవతలి వ్యక్తి ఆర్థికంగా, సామాజికంగా పలుకుబడి ఉన్న వారైతే.. వారి గురించి సరైన సమాచారం తీసుకువచ్చేందుకు చాలా ఇబ్బందులు ఉంటాయి. తమ కుటుంబంలో వచ్చే అల్లుడు గురించే కాదు.. కోడలి గురించి కూడా చాలా మంది కుటుంబ పెద్దలు అన్ని విషయాలు ముందుగానే తెలుసుకోవాలని మా వద్దకు వస్తున్నారు.

పెళ్లి వరకే కాదు. పెళ్లి తరువాత కూడా తమ భర్త, లేదా భార్య అక్రమ సంబంధం కలిగి ఉన్నారనే అనుమానాలతో మా వద్దకు వచ్చే వారున్నారు. కానీ ఈ పని చాలా ఇబ్బందులతో కూడు కుంది. గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్ మెంట్స్ లోకి మాకు ప్రవేశానికి అనుమతి ఉండదు. అందుకే ఏదో కథలు అల్లాల్సి వస్తుంది. ఇళ్లలో రహస్యంగా వాయిస్ రికార్డర్లు పెట్టి అవతలి వ్యక్తి మాటలు వినాల్సి ఉంటుంది. దీని కోసం గ్యాడ్జెట్స్ అవసరం. ఆ గ్యాడ్జెట్స్ ఒకసారి మాత్రమే ఉపయోగిస్తాం. అని చెప్పారు.

భావన పాలివాల్ లాగే వీనస్ డిటెక్టివ్స్ పేరుతో ఆఫీసు నడిపే ఆకృతి ఖత్రి కూడా వెడ్డింగ్ బ్యాక్ గ్రౌండ్ చెక్ చేస్తున్నారు. ఆమె ఈ సంవత్సరంలోనే వందల సంఖ్యలో ఇలాంటి కేసులు పరిష్కారించామని తెలిపింది. “ఒక వరుడు ‘గే’ అని అనుమానంతో మా వద్దకు వచ్చారు. మా విచారణలో అది నిజమని తేలింది. ఒకవేళ ఈ పెళ్లి జరిగి ఉంటే.. ఆ యువతి జీవితం నాశనమయ్యేది. అందుకే దీన్ని సమాజ సేవగా చూడాలి. చాలా కేసుల్లో పోలీసుల సాయం కూడా అవసరమవుతుందని” అమె అన్నారు.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×