BigTV English

Rupi Kaur : అమెరికా రమ్మంటే.. రాను పొమ్మంది.. ఎవరీమె?

Rupi Kaur : అమెరికా రమ్మంటే.. రాను పొమ్మంది.. ఎవరీమె?

Rupi Kaur : వైట్ హౌస్. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం. అక్కడ డిన్నర్ అంటే ఎంత ప్రెస్టేజియస్‌గా ఉంటుంది. వైట్ హౌస్ లో డిన్నర్ పిలుపు కోసం ఎదురుచూసే సెలబ్రిటీలో లక్షల్లో ఉంటారు. అయితే, అలాంటి అరుదైన, అద్భుతమైన అవకాశం వస్తే కూడా కాదు పొమ్మంది ఓ యువతి. ఔను. వైట్ హౌస్‌లో దీపావళి సందర్భంగా ఆమెకు ఆహ్వానం అందితే నేను రానని చెప్పింది.


రుపి కౌర్. కెనడాలో ఫేమస్ పొయెట్. ఇన్‌స్టాలో ఫుల్ పాపులర్. ఆమె రాసిన “మిల్క్ అండ్ హనీ” బుక్ 25 లక్షలకు పైగా కాపీలు అమ్ముడయ్యాయి. బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. 40కిపైగా భాషల్లో ట్రాన్స్‌లేట్ చేయబడింది. అలాంటి రుపి కౌర్.. లేటెస్ట్‌గా మరోసారి న్యూస్‌లో నిలిచారు. ఏకంగా అమెరికన్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్విటేషన్‌ను రిజెక్ట్ చేశారు. ఆమె ఆ ఆహ్వానాన్ని తిరస్కరించిన కారణం.. యూఎస్‌కు మరింత షాకింగ్ విషయం.

అమెరికాలో ఎన్నారైల సంఖ్య ఎక్కువే. ఆ దేశంలో బలమైన ముద్ర వేశారు మనోళ్లు. అందుకే, ఏటేటా వైట్ హౌజ్‌లో మన దీపావళి పండుగను అధికారికంగా సెలబ్రేట్ చేస్తుంటారు. ఈసారి వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఆధ్వర్యంలో నిర్వహించే దివాలీ వేడుకలకు రావాలంటూ.. కెనడాలో ఉండే సిఖ్ పోయెట్ రుపి కౌర్‌కు ఆహ్వానం అందింది. అయితే, ఆ ఆహ్వానాన్ని ఘాటుగా రిజెక్ట్ చేసింది ఆ టాప్ పోయెట్. తాను అమెరికాకు రానంటూ ఎక్స్ వేదికగా ఆ ఇన్విటేషన్‌ను రిజెక్ట్ చేస్తూ స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ కూడా చేశారు. ఆదే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్‌ను ఉలిక్కిపడేలా చేస్తోంది.


పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు చేయడం.. ఆ అటాక్స్‌లో వందలాది పౌరులు చనిపోతుండటం.. అందులో ఎక్కువ సంఖ్యలో చిన్నపిల్లలే ఉండటం.. రుపి కౌర్‌ను కలిచివేసింది. అలాంటి మారణహోమానికి మద్దతు తెలుపుతున్న అమెరికా తీరుకు వ్యతిరేకంగా తాను.. వైట్ హౌజ్ నుంచి తనకు వచ్చిన దీపావళి వేడుకల ఇన్విటేషన్‌ను రిజెక్ట్ చేస్తున్నట్టు ఓపెన్‌గా.. ఎక్స్ వేదికగా ప్రకటించి కలకలం రేపారు రుపి కౌర్. అంతేకాదు.. పాలస్తీనాలో దాడులను ఖండిస్తూ సుదీర్ఘ పోస్ట్ కూడా పెట్టారు.

రుపి కౌర్ చాలా డైనమిక్. కాంట్రవర్సీలు ఆమెకు కొత్తేమీ కాదు. గతంలో తన పీరియడ్ బ్లీడింగ్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. ఆ పోస్ట్‌ను ఇన్‌స్ట్రాగ్రామ్ డిలీట్ చేయడంతో.. ఒక్కసారిగా ఆమె పేరు వరల్డ్ వైడ్ మారుమోగిపోయింది.

రుపి కౌర్ పంజాబ్‌లోనే పుట్టినా.. మూడేళ్ల వయస్సులోనే ఆమె కుటుంబం కెనడాకు వలస వెళ్లింది. అక్కడే సెటిలై.. తన పుస్తకాలతో బాగా పాపులర్ అయ్యారు 31 ఏళ్ల రుపి కౌర్. ఈ ఏడాది ప్రారంభంలో ఖలిస్తాన్‌కు మద్దతుగా ఆమె పెడుతున్న పోస్టులకు గాను.. ఇండియాలో రుపి కౌర్ ట్విట్టర్ అకౌంట్‌ను నిలిపివేశారు. మళ్లీ ఇప్పుడు అమెరికా ఇన్విటేషన్‌ను రిజెక్ట్ చేయడంతో మరోసారి రుపి కౌర్ పేరు ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఆమెకు సపోర్ట్‌గా, వ్యతిరేకంగా అనేకమంది స్పందిస్తున్నారు. ఫాలోయర్స్ అంతా తనకు మద్దతుగా నిలవాలని ఆమె కోరుతున్నారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×