BigTV English

Angelina Jolie : పాలస్తీనాకు మద్దతు పలికిన హాలివుడ్ నటి.. ఆమెను తప్పుబట్టిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు

Angelina Jolie : గాజా ప్రజలకు మద్దతు పలికిన హాలివుడ్ అందాలభామ ఏంజలీనా జోలికి ఇజ్రాయెల్ అధ్యక్షుడు తీవ్రంగా విమర్శించారు. ఇజ్రాయెల్ వ్యతిరేక వైఖరిని ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ సోషల్ మీడియా ద్వారా తప్పుబట్టారు.

Angelina Jolie : పాలస్తీనాకు మద్దతు పలికిన హాలివుడ్ నటి.. ఆమెను తప్పుబట్టిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు

Angelina Jolie : గాజా ప్రజలకు మద్దతు పలికిన హాలివుడ్ అందాలభామ ఏంజలీనా జోలికి ఇజ్రాయెల్ అధ్యక్షుడు తీవ్రంగా విమర్శించారు. ఇజ్రాయెల్ వ్యతిరేక వైఖరిని ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ సోషల్ మీడియా ద్వారా తప్పుబట్టారు.


“ఇజ్రాయెల్‌లో జరిగింది ఒక ఉగ్రవాద చర్య. కానీ దానికి ప్రతీకారంగా గాజాలో ఎక్కడా ఆహారం, నీరు అందుబాటులో లేకుండా చేయడం. బాంబు దాడిలో అమాయకు పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని సమర్థించలేం. ఆశ్రయం పొందేందుకు సామాన్యులు సరిహద్దును దాటడం ప్రాథమిక మానవ హక్కు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల ఫలితంగా గాజా సామూహిక సమాధిగా మారుతోంది,మిలియన్ల మంది పాలస్తీనియన్ పౌరులు, పిల్లలు, మహిళలు, కుటుంబాలు సామూహికంగా శిక్షించబడుతుండటం ప్రపంచం చూస్తోంది. ఇలాంటి చర్యలను అడ్డుకోకుండా ఐక్యరాజ్య సమితిని కొని దేశాల ప్రభుత్వాలు నిలువరిస్తున్నాయి. అలా చేస్తున్న దేశాలన్నీ యుద్ధ నేరస్థులే,” అని ఏంజెలీనా పేర్కొంది.

అలాగే శరణార్థులకు సహాయం చేయడానికి ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేసిన తన అనుభవాన్ని ఆమె గుర్తుచేసారు.


జోలీని తప్పుబట్టిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు

ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ నటి ఏంజలీనా జోలి చేసి వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. “ఏంజలీనా జోలీ చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఆమెకు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులపై సరైన అవగాహన లేదని అనుకుంటున్నాను. ఇక్కడ యుద్ధం జరుగుతోంది. ఎటువంటి మానవ సంక్షోభం లాంటి దుస్థితి లేదు. ఆమె చెబుతున్నట్లు గాజా ఒక జైలు లాంటిది. కానీ అందుకు ఇజ్రాయెల్ కారణం కాదు. గాజా ఒక ఇరాన్ ఉగ్రావాదుల అడ్డా. ఈ యుద్ధం ముగిసిన తరువాత గాజా పౌరుల కోసం ఒక సభ్య సమాజం ఏర్పాటు చేస్తాం,” అని ఆయన అన్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×