హాలోవీన్ సీజన్‌కు పర్ఫెక్ట్ గిఫ్ట్‌గా వచ్చిన మలయాళ హారర్ థ్రిల్లర్ సినిమా ‘డైస్ ఇరే (Dies Irae)’. థియేటర్లలో ఈ సునామీ సృష్టించింది. 2025 అక్టోబర్ 31ప్రణవ్ మోహన్‌లాల్ హీరోగా, రాహుల్ సదాశివన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ ను ప్రేక్షకుల ఆదరిస్తున్నారు. థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో మొదటి రోజే కేరళలో ₹4.65 కోట్లు, వరల్డ్‌వైడ్ ₹10.50 కోట్లతో ప్రణవ్ మునుపటి హిట్ సినిమాలు ‘వర్షాంగల్కు’ ‘షేషం’ కంటే మెరుగ్గా ఓపెన్ అయింది. ప్రణవ్ మోహన్‌లాల్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, ఎమోషనల్ రేంజ్ తో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. మునుపటి ఫిల్మ్స్ లో కనిపించిన ప్రణవ్, ఇక్కడ హారర్ థ్రిల్లర్‌లో కొత్త డైమెన్షన్ కనిపించాడు.
థియేట్రికల్ రన్ తర్వాత డిసెంబర్‌లో ఈ సినిమా ఓటీటీలో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే నిర్మాతలు ప్రకటించలేదు. కానీ మలయాళ రిలీజ్‌ల ప్యాటర్న్ ప్రకారం, థియేట్రికల్ రిలీజ్ తర్వాత 4 నుంచి 6 వారాల లోపు వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ నెల చివరికి గాని, వచ్చే నెల మొదటి వీకలో గాని వచ్చే అవకాశం ఉంది. దీంతో థియేటర్లలో చూడలేని అభిమానులు, డిజిటల్ స్ట్రీమింగ్ కోసం మరి కొంత కాలం ఓపిక పట్టాల్సిందే. అయితే ఈ హర్రర్ డ్రామాలో ప్రణవ్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించగా, అరుణ్ అజికుమార్, జయ కురుప్, జిబిన్ గోపీనాథ్ కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇది రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన మూడవ చిత్రం ఇది.
Read Also : కార్న్ తోటలో కన్నింగ్ క్లౌన్ సైకో… అమ్మాయిలు దొరికితే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ
ఈ సినిమాలో ప్రణవ్ ఒక సంపన్న వ్యక్తి రోహన్ పాత్రను పోషిస్తున్నాడు. అతనికి అతీంద్రియ శక్తులపై పెద్దగా నమ్మకం ఉండదు. అయితే వాటిని దగ్గరుండి కళ్ళారా చూశాకా అతని ప్రపంచం పూర్తిగా తలక్రిందులవుతుంది. అతని తండ్రి డిజైన్ చేసిన లగ్జరీ మాన్షన్‌లోకి వెళ్ళాక రోహన్ జీవితం సడన్‌గా భయానకంగా మారిపోతుంది. ఇంట్లో విచిత్ర శబ్దాలు, దెయ్యాలు కనిపించడం, పారానార్మల్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. రోహన్ ఈ మిస్టరీని డీకోడ్ చేయడానికి ఇన్వెస్టిగేట్ చేస్తాడు. తన కుటుంబం చుట్టూ ఉన్న రహస్యాన్ని ఛేదించే ప్రయత్నంలో, గతంలో తెలియని ప్రాంతాలలోకి వెళ్ళి ఈ సీక్రెట్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. చివరికి రోహన్ ని హంట్ చేస్తున్న అతీంద్రియ శక్తి ఏమిటి ? అతన్ని ఎందుకు వెంటాడుతుంది ? దీని నుంచి రోహన్ ఎలా బయట పడతాడు ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.