BigTV English

Saif Ali Khan: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సైఫ్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు

Saif Ali Khan: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సైఫ్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు

Saif Ali Khan calls Rahul Gandhi brave politician: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల జాతీయ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీపై సైఫ్ ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్ గాంధీ ఎంతో ధైర్యవంతుడైన రాజకీయ నాయకుడు అని కొనియాడారు. నిజాయితీ గల నాయకుడు అంటూ పొగడారు. ప్రజల్లో తన ఇమేజ్‌ను మరింత పెంపొందించుకునేందుకు రాహుల్ తనలో తను చాలా మార్పులు చేసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇటీవల రాజకీయ నాయకులపై చర్చకు రాగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను ప్రశ్నించారు. మీరు ఎలాంటి నాయకుడిని ఇష్టపడతారు? దేశాన్ని భవిష్యత్తులోకి తీసుకెళ్ల సమర్థ రాజకీయ వేత్త ఎవరని అడిగారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ అంటూ పేర్కొన్నారు. ఈ ప్రశ్నకు సైఫ్ అలీఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మీరు చెప్పిన రాజకీయవేత్తలు అందరూ ధైర్యవంతులు అన్నారు. అయితే నాకు మాత్రం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పనితీరు ఎక్కువగా ఆకట్టుకుంటుందన్నారు. ఆయన గతంలో మాదిరిగా కాకుండా కొత్తగా కనిపిస్తున్నారన్నారు. కొంతమంది ఆయనను గతంలో విమర్శలు చేశారని, అలాగే అగౌరవపర్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు.


Also Read: చెన్నై పోర్టు.. 100 కోట్ల డ్రగ్స్ సీజ్, కాకపోతే..

రాహుల్ గాంధీ ఎన్నో విమర్శలు నుంచి బయటకు వచ్చారన్నారు. దీంతో తనను తాను మార్పులు చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అనంతరం ప్రజల్లోకి తన మాటలు వెళ్లేందుకు విపరీతంగా కష్టపడ్డారని చెప్పారు. ఆయన ప్రయాణం ఆసక్తిగా మారిందని సైఫ్ మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×