Big Stories

RSS Chief Mohan Bhagawat: రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

RSS Chief Mohan Bhagawat Comments on Reservations: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సంఘ్ పరివార్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని అన్నారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తారని.. రిజర్వేషన్ విధానాన్ని తొలగిస్తుందని విపక్షాలు ఆరపణలు చేయడంతో మెహన్ భగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

- Advertisement -

హైదరాబాద్‌లోని ఒక విద్యాసంస్థలో జరిగిన కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ, రిజర్వేషన్‌లను అవసరమైనంత కాలం పొడిగించాలని సంఘ్ అభిప్రాయపడిందని తెలిపారు.

- Advertisement -

కాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని.. విపక్షాలు కావాలనే ఇలా దుష్ప్రచారాలు చేస్తున్నాయని అన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వాడి మరీ వీడియోలు సృష్టిస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాను ఈ తప్పుడు ప్రచారాలకోసం వాడుకుంటున్నారని.. సామాజిక మాధ్యమాలను మంచి కోసం వాడాలని పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ వివాదాలు సృష్టిస్తున్నారని.. ఇది తగదని అభిప్రాయపడ్డారు.

Also Read: ఇంకా నా వల్ల కాదు.. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ పదవికి లవ్లీ రాజీనామా..

కాగా 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆర్ఎస్ఎష్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలంటూ వివాదాస్పద ప్రకటన చేశారు. ఆయన వ్యాఖ్యను స్వీకరించిన మహాఘటబంధన్ (మహాకూటమి) బీజేపీని దెబ్బతీసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News