BigTV English

Arvinder Singh Lovely: ఇంకా నా వల్ల కాదు.. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ పదవికి లవ్లీ రాజీనామా..

Arvinder Singh Lovely: ఇంకా నా వల్ల కాదు.. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ పదవికి లవ్లీ రాజీనామా..

Delhi Congress chief Arvinder Singh Lovely Resigns: ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అర్విందర్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి దీపక్ బబారియా నిరంతరం జోక్యం చేసుకుంటున్నారని అర్విందర్ సింగ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గేకు లేఖ రాశారు.


ఖర్గేకు రాసిన రాజీనామా లేఖలో లవ్లీ తాను వికలాంగుడిగా భావిస్తున్నానని తెలిపారు. ఇంకా నా వల్ల కాదు.. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించలేనని.. రాజీనామా చేస్తున్నాని లేఖలో పేర్కొన్నారు.

కాగా బాబారియా జోక్యంపై ఇప్పటికే పలువురు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భాలను ఆయన పేర్కొన్నారు. అయితే, బబారియాకు వ్యతిరేకంగా ఉన్న అసంతృప్త నేతలను బహిష్కరించాలని తనపై విపరీతమైన ఒత్తిడి ఉందని లవ్లీ తెలిపారు. అందుకే ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు.


లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదని లేఖలో పేర్కొన్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుండగా మిగిలిన నాలుగు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. దీంతో ఈ పొత్తు ఢిల్లీ నేతలకు ఇష్టం లేదని లవ్లీ తన రాజీనామా లేఖలో తెలిపారు. పొత్తులో వచ్చిన 3 సీట్లలో 2 స్థానాల్లో స్థానికేతరులకు ఇవ్వడంతో అసంతృప్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Tags

Related News

PM Kisan Samman Nidhi: ఈ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ డబ్బులు విడుదల.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే?

Idli Google Doodle: వేడి వేడి ఇడ్లీ.. నోరూరిస్తోన్న గూగుల్ డూడుల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

EPFO Tagline Contest: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?

Earthquake: వణికిన ఫిలిప్పీన్స్.. 7.6 తీవ్రతతో భారీ భూకంపం

UP Governor: యూపీ గవర్నర్ వార్నింగ్.. సహజీవనం వద్దు, తేడా వస్తే 50 ముక్కలవుతారు

Tata Group: టాటా గ్రూప్‌లో కుంపటి రాజేస్తున్న ఆధిపత్య పోరు.. రంగంలోకి కేంద్రం..

Donald Trump: ప్రెసిడెంట్ ట్రంప్‌నకు యూఎస్ చట్టసభ సభ్యులు లేఖ

Narendra Modi: ఓటమి తెలియని నాయకుడు.. కష్టపడి పని చేసి, ప్రపంచానికి చూపించిన లీడర్..

Big Stories

×