E-Paper
Advertisement

Sharad Pawar Comments on BJP: ఓట్ల కోసమే రామమందిరం నిర్మాణం.. శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు

Sharad Pawar Comments on BJP: ఓట్ల కోసమే రామమందిరం నిర్మాణం.. శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

Sharad Pawar Sensational Comments on Ayodhya Ram Mandir: ఓట్ల కోసమే బీజేపీ ప్రభుత్వం రామమరందిరం నిర్మాణం చేస్తే.. అయోధ్య ప్రజలు మతపరమైన రాజకీయాలకు ప్రోత్సాహం ఇవ్వమని చెప్పకనే చెప్పారని ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూణే జిల్లాలోని బారామతిలో శరద్ పవార్ మాట్లాడారు. ఆలయ రాజకీయాలను ఎలా సరిదిద్దగలరో అయోధ్య ప్రజలు చేతల్లో చూపించారని, బీజేపీని ఓడించి ఆలయ రాజకీయాలను సరిచేశారని వ్యాఖ్యానించారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో అయోధ్య ఆలయం ఉండే ఫైజాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఓటమి చెందిన విషయం తెలిసిందే.

విలక్షణమైన తీర్పు..

Advertisement

2019 ఎన్నికల్లో 300 కంటే ఎక్కువ సీట్లు గెలిచిన బీజేపీ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 240 సీట్లకు పడిపోయిందని పవార్ అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 60 సీట్లు తగ్గాయని, ఇది చాలా తక్కువ మెజార్టీ అని చెప్పారు. ఈ సీట్ల తగ్గుదలలో ఉత్తరప్రదేశ్ కీలక రాష్ట్రంగా మారిందని, ఇక్కడి ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారి పవార్ వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు తెలివైన వారని, ఆలయం పేరిట ఓట్లు అడుగుతున్నారని గ్రహించి వైఖరి మార్చుకున్నారని తెలిపారు. ఫలితంగా బీజేపీ ఓటమి చెందిందన్నారు.

రాజకీయాలతో సాధ్యం కాదు..

Advertisement

ఓట్లు అడిగేందుకు రామమందిరమే ఎన్నికల అజెండాగా అయోధ్య ఆలయాన్ని ఉపయోగించడాన్ని చూసి తాము భయపడ్డామని పేర్కొన్నారు. కానీ ప్రజలు రాజకీయాలనుచ మత విశ్వాసాలను కలిపి చూడరని ముందే ఉహించానన్నారు. అందుకే ప్రజలు అనుకున్న దానికంటే భిన్నమైన తీర్పు ఇచ్చారన్నారు. దీంతో ఫైజాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి లల్లూ సింగ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దేశంలో ప్రజాస్వామ్యం చెక్కు చెదరకుండా ఉందని, దానిని అంతం చేయడం రాజకీయాలతో సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించాడు.

Also Read: కొత్త ఆర్మీ చీఫ్‌గా డిప్యూటీ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది

సొంత మెజార్టీ ఎక్కడ..?

పదేళ్లుగా బీజేపీ అధికారంలో ఉండి నచ్చిన విధంగా మార్పులు చేర్పులు చేశారని, దీంతో ప్రజలు ఆ పార్టీ నాయకులను తిరిగి నేలమీదకు తెచ్చారని పవార్ విమర్శలు చేశారు. అయితే మోదీజీ.. సొంత మెజార్టీ ఎక్కడ అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది సొంతంగా సాధించిన మెజార్టీతో కాదని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీష్ కుమార్ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. కూటమితో ప్రభుత్వం నడిచే సమయంలో అందరి ఆలోచనలకు అనుగుణంగా పాలన చేపట్టాలన్నారు. అయితే ఇక నుంచి మోదీ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదని ఎద్దేవా చేశారు.

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×