Shashi Tharoor: భారత క్రికెట్ జట్టు ఈ రోజు చారిత్రాత్మక విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై ఓవల్‌లో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో 6 రన్స్ తేడాతో సంచలన విజయం సాధించి.. సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ చారిత్రక విజయం తర్వాత కాంగ్రెస్ ఎంపీ, క్రికెట్ అభిమాని అయిన శశి థరూర్ తన భారత్ జట్టుకు క్షమాపణ చెప్పారు. అంతకు ముందు శశి థరూర్ టీమిండియా కించపరుస్తూ.. భారత జట్టు నుండి విరాట్ కోహ్లీ లేని లోటును ప్రస్తావించాడు. జట్టు ఓటమి ఖాయమని భారత్ టీంను కించపరిచారు. అయితే, జట్టు అద్భుత ప్రదర్శనతో అతని అంచనాలను తలకిందులు చేసింది.
మ్యాచ్‌లో భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించారు. 9 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సిరాజ్, ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు. జస్ప్రీత్ బుమ్రా లేనప్పటికీ, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణతో కలిసి ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్‌ను కుప్పకూల్చేసింది. చివరి దెబ్బగా సిరాజ్ గస్ ఆట్కిన్సన్‌కు ఖచ్చితమైన యార్కర్‌తో మ్యాచ్‌ను ముగించారు. సిరాజ్ మ్యాచ్ రోజు ఉదయం “బిలీవ్” ఎమోజీ వాల్‌పేపర్‌ను చూసి, దేశం కోసం గెలవాలని సంకల్పించినట్లు చెప్పారు.
శశి థరూర్ తన ట్విట్టర్ అకౌంట్ లో టీమిండియా గట్స్, సంకల్పం, అభిరుచిని కొనియాడారు. ఇంగ్లాండ్‌పై సిరీస్ క్లైమాక్స్ విజయంతో.. కోసం ఉద్వేగభరితంగా ఉన్నాను!’ అని రాసుకొచ్చారు.. అంతకుముందు రోజు, కోహ్లీ లేకపోవడంతో జట్టు గెలవలేదని సందేహించినందుకు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత జట్టులో అతని టీంలో ఉత్సాహం, బ్యాటింగ్ నైపుణ్యాలు లోపించాయని థరూర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ: Nirmal District: బిర్యానీ కోసమని వెళ్తే.. స్కూటీ డిక్కీలోని రూ.5లక్షలు దొబ్బేశారు..
ఈ మ్యాచ్‌లో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 224 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్‌ను 247 పరుగులకు అలౌట్ అయ్యింది. రెండవ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ సెంచరీతో 396 పరుగులు చేసి, ఇంగ్లాండ్‌కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లాండ్ 339/6 వద్ద ఉండగా, టీమిండియా బౌలర్లు చివరి రోజు 28 పరుగులకు 4 వికెట్లు తీసి విజయాన్ని అందించారు. దీంతో టీమిండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించంది. ఈ విజయం భారత జట్టు పట్టుదలను, సిరాజ్ అసాధారణ ప్రదర్శనను హైలైట్ చేసింది. థరూర్‌ను క్షమాపణ చెప్పేలా చేసింది. ఇది కదా మరీ టీమిండియా అంటే జయహో…
ALSO READ: Heavy rain: హైదరాబాద్‌లో భారీ వర్షపాతం.. ఈ ఏడాదిలోనే రికార్డు, ఆ ప్రాంతంలో ఏకంగా 151 మీమీ