Nirmal District News: రోజు రోజుకీ రాష్ట్రంలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో పట్ట పగలే స్కూటీ డిక్కీ నుంచి రూ.5లక్షలను దొంగలించారు. స్క్రూ డ్రైవర్ తో డిక్కీ తెరిచి డబ్బులతో అక్కడ నుంచి పరార్ అయ్యారు. సీసీ టీవీలో చోరీ దృశ్యాలు రికార్డు అయ్యాయి. సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని హెడ్బిట్ గ్రామానికి చెందిన బాంబోతుల ఆనంద్ ఆనంద్ అనే వ్యక్తి ఈ రోజు బ్యాంక్ నుంచి రూ.5లక్షలు డ్రా చేశారు. ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో బార్ అండ్ రెస్టారంట్ వద్ద ఆగారు. అలా లోపలికి వెళ్లి బయటకు వచ్చేసరికి నగదు మాయమైంది. ఘటన ఒక్కసారిగా భైంసా పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ALSO READ: Heavy rain: హైదరాబాద్‌లో భారీ వర్షపాతం.. ఈ ఏడాదిలోనే రికార్డు, ఆ ప్రాంతంలో ఏకంగా 151 మీమీ
అమెరికాలో ఉన్న కూతరు, తండ్రి కోసమని డబ్బులు పంపింది. దీంతో ఆనంద్ బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకున్నారు. అయితే స్కూటీ డిక్కీలో డబ్బుల కట్టులు పెట్టుకుని అతను ఇంటికి పయనం అయ్యారు. అయితే భోజనం కోసం అని ఆనంద్ ఓ రెస్టారెంట్ వద్ద ఆగాడు. అయితే, ఓ వ్యక్తి అతడిని ఫాల్లో అయ్యాడు. ఆనంద్ బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేయడం.. డిక్కీలో డబ్బులు పెట్టుకోవడం తతాంగాన్ని అంతా గమనించుకుంటూనే ఉన్నాడు.
ALSO READ: Guvvala Balaraju: కేసీఆర్‌కు బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా..
అయితే.. సరిగ్గా ఆనంద్ రెస్టారెంట్ లో భోజనం చేసి బయటకు వచ్చే వరకే నగదు మాయమైంది. నిందితుడు స్క్రూ డ్రైవర్ తో డిక్కీని ఓపెన్ చేసి రూ.5 లక్షలను దొంగలించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. బాధిత వ్యక్తి వెంటనే నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని బాధిత వ్యక్తి ఆనంద్ కు భరోసా ఇచ్చారు.