BigTV English
Advertisement

ICC WTC Points Table : 5వ టెస్ట్ విన్… WTC పాయింట్స్ టేబుల్ లో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..?

ICC WTC Points Table : 5వ టెస్ట్ విన్… WTC పాయింట్స్ టేబుల్ లో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..?

ICC WTC Points Table :  లండన్ లో ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఇవాళ ముగిసింది. 5 టెస్ట్ మ్యాచ్ లో సిరీస్ లో ఒక మ్యాచ్ డ్రా కాగా.. చెరి రెండు మ్యాచ్ లను గెలుసుకున్నారు. దీంతో సిరీస్ సమం అయింది. దీంతో WTC పాయింట్ల పట్టికలో టీమిండియా మూడో స్థానానికి చేరుకుంది. మరోవైపు టీమిండియా నాలుగో టెస్ట్  డ్రా చేసుకోవడంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్లను సంపాదించి 16 పాయింట్లకి చేరుకుంది. 2025-27 స్టాండింగ్స్ లో  ప్రస్తుతం మూడో  స్థానంలో నిలిచింది.  వెస్టిండీస్ పై 3-0 సిరీస్ విజయంతో ఆస్ట్రేలియా జట్టు ఆధిక్యం కనబరుస్తోంది. న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా ఇంకా ఆడలేదు. జట్లు గెలుపొందితే 12 పాయింట్లు.. డ్రా అయితే నాలుగు పాయింట్లు సంపాదిస్తాయి. మొదటి రెండు జట్లు జూన్ 2027లో లార్డ్స్ లో జరిగే WTC ఫైనల్ కి చేరుకుంటాయి.


థర్డ్ ప్లేస్ లో టీమిండియా 

ఆస్ట్రేలియా జట్టు మొత్తం 3 మ్యాచ్ లు ఆడితే మూడు మ్యాచ్ లో గెలిచింది. 36 పాయింట్లతో టాప్ ప్లేస్ లో దూసుకెళ్తోంది. శ్రీలంక జట్టు 2 మ్యాచ్ లు ఆడితే 1 మ్యాచ్ లో విజయం సాధించగా.. మరో మ్యాచ్ డ్రా గా ముగిసింది. దీంతో 16 పాయింట్లతో పాటు 66.67 శాతం తో రెండో స్థానంలో ఉంది. ఇక టీమిండియా 5 మ్యాచ్ లు ఆడితే వాటిలో 2 మ్యాచ్ ల్లో విజయం సాధించింది.. మరో రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. ఒక మ్యాచ్  డ్రా తో ముగిసింది. 28  పాయింట్లతో  పాటు 46.67 శాతంతో మూడో స్థానంలో కొనసాగుతోంది. అలాగే ఇంగ్లాండ్ జట్టు కూడా 5 మ్యాచ్ లు ఆడితే.. రెండింటిలో విజయం సాధించింది. ఒక మ్యాచ్ ని డ్రాతో ముగించింది. 26 పాయింట్లతో పాటు 43.33 శాతంతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఇంగ్లాండ్ జట్టు ఇటీవల స్లో ఓవర్ రేట్ కి రెండు పాయింట్లను కోల్పోవాల్సి వచ్చింది ఇంగ్లాండ్ జట్టు. బంగ్లాదేశ్ జట్టు 2 మ్యాచ్ లు ఆడితే 1 మ్యాచ్ లో ఓటమి చెంది.. మరో మ్యాచ్ డ్రా అయింది. దీంతో బంగ్లాదేశ్ కి కేవలం 16 పాయింట్లు మాత్రమే లభించాయి. వెస్టిండిస్ జట్టు ఆస్ట్రైలియా పై మూడు మ్యాచ్ లు ఆడితే.. మూడు మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది.


చివరి స్థానంలో వెస్టిండీస్.. 

దీంతో వెస్టిండీస్ జట్టు పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 7వ స్థానంలో కొనసాగుతుంది. ఇక న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్లు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ జట్లు కూడా టెస్ట్ సిరీస్ ఆడితే.. పాయింట్ల పట్టిక తారు మారు అవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆస్ట్రేలియా జట్టు మాత్రం మంచి ఊపులో కొనసాగుతోంది. టీమిండియా మరో మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై విజయం సాధిస్తే.. టీమిండియా ఒక స్థానం ఎగబాకే అవకాశం కనిపిస్తోంది. శ్రీలంక కంటే కూడా మెరుగయ్యే అవకావం లేకపోలేదు. టీమిండియా ఓటమి పాలైతే మాత్రం పాయింట్ల పట్టికలో కాస్త వెనుకంజ అయ్యే అవకాశం ఉంది. టీమిండియా విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 

Related News

World Cup 2025: RCB చేసిన పాపం.. టీమిండియా మ‌హిళ‌ల‌కు త‌గులుతుందా, సెల‌బ్రేష‌న్స్ లేకుండానే ?

Virat Kohli: 6 గురు అమ్మాయిల‌తో విరాట్ కోహ్లీ ఎ**ఫైర్లు..లిస్ట్ రోహిత్ శ‌ర్మ భార్య కూడా ?

Sara -Shubman Gill: బ‌ట్ట‌లు విప్పి చూపించిన గిల్‌…బిల్డ‌ప్ కొట్ట‌కు అంటూ సారా సీరియ‌స్!

Hardik Pandya: ప్రియురాలి కారు కడుగుతున్న హార్దిక్ పాండ్యా…ముద్దులు పెడుతూ మ‌రీ !

Haris Rauf: హారిస్ రవూఫ్ పై ICC బ్యాన్..సూర్య‌కు కూడా షాక్‌

RCB: బెంగ‌ళూరుకు కొత్త కోచ్‌..WPL 2026 టోర్న‌మెంట్‌, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం

Womens World Cup 2025: హ‌ర్ధిక్ పాండ్యాను కాపీ కొడుతున్న లేడీ బుమ్రా

PM Modi: వరల్డ్ కప్ విజేతలకు PM మోడీ బంపర్ ఆఫర్.. డైమండ్ నెక్లెస్​ల బహుమతి!

Big Stories

×