E-Paper
Advertisement

ట్విస్ట్ అంటే ఇది.. నిన్న పోస్టింగ్, నేడు రిటైర్మెంట్! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అధికారుల నిర్వాకం

ట్విస్ట్ అంటే ఇది.. నిన్న పోస్టింగ్, నేడు రిటైర్మెంట్! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అధికారుల నిర్వాకం
Advertisement

Government Job: ఒక్క రోజు.. కేవలం ఒక్కటంటే ఒక్క రోజు ముందు ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎలా ఉంటుంది? జీవితకాల స్వప్నం నెరవేరిందన్న సంతోషం తీరకముందే, మరుసటి రోజే రిటైర్మెంట్ బోర్డు కనిపిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. కానీ, ఝార్ఖండ్ విద్యాశాఖ పుణ్యమా అని ఇలాంటి విచిత్రమైన, కాస్త బాధాకరమైన సంఘటనలు నిజంగానే జరిగాయి. పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం కోసం దశాబ్దాలుగా ఎదురుచూసిన ఇద్దరు ఉపాధ్యాయుల జీవితాల్లో అక్కడి ప్రభుత్వ లేరాని తనం ఆడుకున్న వింత నాటకం ఇది.

20 ఏళ్ల నిరీక్షణ.. ఒక్క రోజు ముచ్చట!
అయితే ఝార్ఖండ్‌కు చెందిన నందలాల్ అనే వ్యక్తి 2006 నుంచి పారా టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, పర్మనెంట్ స్టేటస్ కల్పించాలని పారా టీచర్లు ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2023లో అసిస్టెంట్ టీచర్ల నియామకం కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. ఎలాగైనా పర్మనెంట్ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో నందలాల్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఆయనకు ప్రభుత్వ నియామక పత్రం (Joint Letter) అందింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఏంటంటే.. ఆయనకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చిన మరుసటి రోజే ఆయన రిటైర్మెంట్ వయసు (60 ఏళ్లు) నిండిపోవడంతో ఉద్యోగ విరమణ చేయాల్సి వచ్చింది. అంటే, కేవలం ఒక్క రోజు పర్మనెంట్ ఉద్యోగిగా ఉండి ఆయన రిటైర్ అయిపోయారు.

Advertisement

రిటైర్మెంట్ అయిపోయాక.. ఆర్డర్ కాపీ చేతికి
నందలాల్ కథ ఇలా ఉంటే.. నయీమ్ అనే మరో ఉపాధ్యాయుడి పరిస్థితి మరీ విచిత్రంగా మారింది. నయీమ్‌కు కూడా అసిస్టెంట్ టీచర్‌గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. కానీ, ఆయనకు పోస్టింగ్ ఆర్డర్ చేతికి వచ్చేసరికే ఆయన రిటైర్మెంట్ వయసు దాటి నెల రోజులు దాటిపోయింది. అంటే, ఉద్యోగ విరమణ వయసు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఆయనకు “మీకు ఉద్యోగం వచ్చింది.. విధుల్లో చేరండి” అంటూ ఆర్డర్ కాపీ పంపింది. ఒకవైపు పర్మనెంట్ ఉద్యోగం వచ్చిందన్న ఆనందం ఉన్నా.. సాంకేతికంగా విధుల్లో చేరలేని పరిస్థితిని చూసి సదరు ఉపాధ్యాయుడు తలపట్టుకున్నారు.

ప్రభుత్వ ఆలస్యం.. ఉద్యోగుల శాపం!
ఈ విచిత్ర పరిస్థితులకు ప్రభుత్వ యంత్రాంగం యొక్క మందకొడితనమే ప్రధాన కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2023లో ప్రారంభమైన నియామక ప్రక్రియను పూర్తి చేయడానికి విద్యాశాఖకు మూడేళ్ల సమయం పట్టింది. ఈ సుదీర్ఘ ఆలస్యం వల్ల ఎందరో అర్హులైన అభ్యర్థుల వయోపరిమితి ముగిసిపోయింది. ఏళ్ల తరబడి చాలీచాలని జీతాలతో పారా టీచర్లుగా పనిచేసి, రిటైర్ అయ్యే వయసులో పర్మనెంట్ ఉద్యోగ పత్రాలు అందుకోవడం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త వైరల్ అవ్వడంతో పాటు.. “ఇదేందయ్యా ఇది.. ఇలాంటి నియామకాలు ఎక్కడైనా ఉంటాయా?” అంటూ నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: భాగ్యనగరానికి ఏమైంది? కళ్లముందే ఐటీ కంపెనీలు.. చేతిలో డిగ్రీలు.. అయినా దొరకని ఉద్యోగాలు

Related News

రేషన్‌ కార్డు‌దారులకు బిగ్ అలర్ట్.. కోటిన్నర కార్డులు రద్దు? 6 నెలలుగా రేషన్ తీసుకోకుంటే

జవాన్ల మధ్య అంతర్గత కలహాలు.. నలుగుర్ని కాల్చి చంపిన మరొక జవాన్, జమ్మూకాశ్మీర్‌లో దారుణం

రూ.3 వేల మందుకు రూ. 27 వేలా? కేంద్రంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

చైనా మీదుగా భారత విమానాలు.. పాక్ ఆంక్షలకు చెక్ పెట్టేలా.. డ్రాగన్‌తో కేంద్రం చర్చలు!

ఇద్దరు అమ్మాయిలు-ఆటో డ్రైవర్‌కు మధ్య ఫైటింగ్, బెంగుళూరులో ఘటన, వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం ధ్వంసం, నలుగురు దుర్మరణం!

టెంపుల్ పూజారిని చావబాదారు.. అసలు కారణం అదేనా? రంగంలోకి జైపూర్ పోలీసులు, వీడియో వైరల్

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

Big Stories

Advertisement
×