BigTV English

Shraddha Murder Case Update : పూర్తయిన పాలీగ్రాఫ్ టెస్ట్.. అఫ్తాబ్ వ్యాన్ పై కత్తులతో దాడి..

Shraddha Murder Case Update : పూర్తయిన పాలీగ్రాఫ్ టెస్ట్.. అఫ్తాబ్ వ్యాన్ పై కత్తులతో దాడి..

Shraddha Murder Case Update : శ్రాద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్‌కు పాలీగ్రాఫ్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇక నార్కో అనాలసిస్ పరీక్ష కూడా పూర్తి చేయాల్సి ఉంది. అఫ్తాబ్ నేరాలు రోజుకొకటి చొప్పున బయట పడుతున్నాయి. డ్రగ్స్‌లో మునిగి కిరాతకంగా అఫ్తాబ్ తయారైనట్లు దర్యాప్తులో తెలుస్తోంది. గుజరాత్‌కు చెందిన డ్రగ్ సప్లయర్ ఫైసల్ మొమిన్‌తో అఫ్తాబ్‌కు పరిచయం ఉన్నట్లు పోలీసులు కనుగ్గొన్నారు. ముంబైలో అఫ్తాబ్ నివసించే వాసై ప్రాంతంలోనే ఫైసల్ కూడా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులు వెలుగుచూసింది. ఇటీవళ డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు ఫైసల్ మొమిన్.


ఇక శ్రద్ధా వాకర్‌ను హత్య చేసిన తరువాత ఆమె చేతికి ఉన్న ఉంగరాన్ని ఆ తరువాత డేటింగ్ చేసిన మహిళకు ఇచ్చినట్లు అఫ్తాబ్ బయటపెట్టాడు. శ్రద్ధాను హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రద్ధాను హత్య చేసిన తరువాత.. అఫ్తాబ్ ముంబయి వచ్చి శ్రద్ధా ఫోన్ ద్వారానే శ్రద్ధా స్నేహితులకు అఫ్తాబ్‌తో బ్రేకప్ అయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. అఫ్తాబ్‌కు ఫారెన్సిక్ పరీక్షల తరువాత ల్యాబ్ నుంచి ఇంటికి తీసుకువెళ్తున్న సమయంలో కొంతమంది కత్తులతో అఫ్తాబ్‌ను తీసుకెళ్తున్న వ్యాన్‌పై దాడి చేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమయి వారందరినీ కంట్రోల్ చేసి తరువాత అరెస్ట్ చేశారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×