BigTV English

Silver Wedding chappal : వెండి చెప్పులు.. పెళ్లిళ్లలో నయా ట్రెండ్..

Silver Wedding chappal : వెండి చెప్పులు.. పెళ్లిళ్లలో నయా ట్రెండ్..
Silver Wedding chappal


Silver Wedding chappal : ఖర్చు విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయినా..పెళ్లి దగ్గరికి వచ్చే సరికి మాత్రం వెనకడుగు వేసేదే లేదు అంటారు. పేదోడైనా అప్పు తెచ్చి మరీ పెళ్లి తంతును ఘనంగా జరిపిస్తారు. బంగారు నగలు, ఖరీదైన బట్టలు, అందమైన స్టేజ్‌లు, డీజేలు, బరాత్‌లు.. ఆ హడావిడే వేరు. పెళ్లిలో ఏదైనా ఓ రేంజ్‌లో ఉండాలనుకునే వారి కోసం.. యూపీలోని లఖ్‌నవూలో ఓ నగల యజమాని వినూత్నంగా ఆలోచించాడు.

దుస్తువులే కాదు చెప్పులు కూడా స్పెషల్‌ ఎట్రాక్షనే అంటున్నాడు. వరుడు, వధువుల కోసం పాదరక్షలను వెండితో రూపొందించారు. 100 నుంచి 500 గ్రాములు ఉండే ఈ చెప్పులు 25 వేలకు అమ్ముతున్నారు. కొన్ని పాదరక్షల మీద రత్నాలు, ముత్యాలను పొదిగి మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. అందుకు తగ్గట్టే.. రేటు కూడా పెంచేశారు.


పాదరక్షలనే కాకుండా వరుడు ధరించే బెల్ట్‌లను కూడా వెండితో రూపొందించాడు నగల వ్యాపారి. బరువు, డిజైన్‌ ఆధారంగా దీని ధరను 20 వేలుగా నిర్ణయించారు. పెళ్లింటి వారి కుటుంబ సభ్యులకు కావాల్సిన ఇతర వస్తువులను వెండితోనే తయారు చేస్తున్నారు. వినియోగదారులు సైతం ఆసక్తి కనబరుస్తుండటంతో మరిన్ని నూతన ఉత్పత్తులను తీసుకొస్తామంటున్నారు వ్యాపారులు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×