E-Paper
Advertisement

ఆస్పత్రిలో విచిత్రం.. సైలెంట్‌గా వచ్చి.. రూ.4 లక్షలు ఎత్తుకెళ్లిన వీధి కుక్క!

ఆస్పత్రిలో విచిత్రం.. సైలెంట్‌గా వచ్చి.. రూ.4 లక్షలు ఎత్తుకెళ్లిన వీధి కుక్క!
Advertisement

Dog Steals Jewellery: సాధారణంగా ఒక వస్తువు చోరీకి గురైతే ఉండే ఆందోళన అంత ఇంత కాదు. అందులోనూ రూ.లక్షల్లో విలువ చేసే నగలు, వేల రూపాయల నగదు ఉన్న బ్యాగ్ మాయమైందంటే గుండెల్లో ఒక్కసారిగా రైళ్లు పరిగెడతాయి. కానీ మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ విచిత్ర దొంగతనం తొలుత బాధితులను కంగారు పెట్టినా.. జరిగిన విషయం తెలిసి నవ్వులు పూయించింది. రూ.4 లక్షల విలువైన నగలు ఉన్న బ్యాగ్ ను ఓ వీధి కుక్క ఎత్తుకెళ్లడమే ఇందుకు కారణం.

వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్ లోని కాయంపూర్ నివాసి అయిన లతా బాయి అనే మహిళ చికిత్స నిమిత్తం మండ్సౌర్ జిల్లా ఆస్పత్రికి వచ్చారు. ఆమె వద్ద రూ.4 లక్షల విలువైన ఆభరణాలు, దాదాపు రూ.2,000 నగదు ఉన్న ఒక సంచి ఉంది. సోమవారం (ఆగస్టు 24) తెల్లవారుజామున 1 గంటల నుంచి 6 గంటల మధ్య సమయంలో ఆసుపత్రి జనరల్ వార్డులో ఉన్న ఆ సంచి ఉన్నట్టుండి మాయమైంది. నగలు పోయాయని గుర్తించిన లతా బాయి తీవ్ర ఆందోళనకు గురై వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు

Advertisement

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఏదైనా దొంగల ముఠా పని అయి ఉంటుందని భావించిన పోలీసులకు.. సీసీటీవీ దృశ్యాలు చూసి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఓ వీధికుక్క చాలా క్యాజువల్‌గా వార్డులోకి నడుచుకుంటూ వచ్చి.. ఆ నగల సంచిని నోట కరుచుకుని హుందాగా బయటకు వెళ్లిపోయింది. బహుశా ఆ బ్యాగ్‌లో ఏదైనా తినే పదార్థం ఉందేమోనన్న భ్రమలో కుక్క దానిని తీసుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఆ కుక్క వెళ్లిన దారిని సీసీటీవీల ద్వారా ట్రాక్ చేసి.. ఆస్పత్రి పక్క వీధిలో సంచిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దాన్ని భద్రంగా లతా బాయికి భద్రంగా అప్పగించారు.

Advertisement

Also Read: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థులు మృతి, ఎలా జరిగింది?

నెటిజన్ల ఫన్నీ కామెంట్లు

ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ కావడంతో.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ కుక్క చాలా తెలివైంది బాబోయ్’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘డాగేష్ భాయ్ నల్లదనాన్ని వెలికి తీసే పనిలో ఉన్నాడు’ అంటూ ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. మరికొందరు మాత్రం ఆస్పత్రిలో వీధి కుక్కల సంచారాన్ని తప్పుబట్టారు. అది కూడా పేషెంట్ల వార్డులోకి కుక్క వచ్చిందంటే.. అక్కడి భద్రతా ఏర్పాట్లు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని పలువురు విమర్శలు చేస్తున్నారు.

Also Read: మన దేశంలోని ‘బుల్లి ఇరాన్’.. పర్షియన్ భాష, సంస్కృతులు.. ఈ ఊరి కథే వేరు!

Tags

Related News

రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. దసరాకి బోనస్..?

‘బ్లూ డ్రమ్’ కేసులో సంచలన తీర్పు.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణ శిక్ష ఖరారు!

పొయ్యిలో 20కి పైగా పాములు.. ఏకంగా పిల్లలతో కాపురం పెట్టేసిందిగా? ధైర్యం ఉంటేనే చూడండి

ప్రేమకు అడ్డొచ్చిందని.. కంటికి రెప్పలా చూసిన నానమ్మనే హత్య చేసిన మనుమరాలు!

గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!

భారతీయ పైలట్‌పై దాడి.. విచారణ ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. యూఏఈకి ప్రత్యేక బృందం!

గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు-పిల్లలతో సహా 14 మంది మృతి, బీహార్‌లో ఘటన

ఢిల్లీ నిరసనలను అడ్డంపెట్టుకుని పాక్ డ్రామాలు.. 200లకు పైగా ఫేక్ పోస్టులు డిలీట్!

Big Stories

Advertisement
×