E-Paper
Advertisement

నేపాల్లో అకస్మిక వరదలు.. 16 మంది మృతి.. 105 మంది భారతీయులు గల్లంతు!

నేపాల్లో అకస్మిక వరదలు.. 16 మంది మృతి.. 105 మంది భారతీయులు గల్లంతు!
Advertisement

Nepal Flash Floods: నేపాల్ లో అకస్మిక వరదలు సంభవించాయి. భారత సరిహద్దుల గుండా ప్రవహించే భోటే కోషి నది (Bhote Koshi River) ఒక్కసారిగా ఉప్పొంగింది. టిబెట్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల వల్ల నదిలో ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించాయి. దీంతో భోటే కోషి ప్రవహించే నేపాల్లోని నువాకోట్, ధాడింగ్, రసువా జిల్లాల్లో విపత్కర పరిస్థితులు తలెత్తాయి. కొండల నుంచి దూసుకొచ్చిన రాకాసి వరద ధాటికి పలు గ్రామాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఇప్పటివరకూ కనీసం 16 మంది చనిపోగా.. 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారు.

సరిహద్దు గ్రామాలపై తీవ్ర ప్రభావం

టిబెట్ కొండల నుంచి ఒక్కసారిగా విరుచుకుపడిన వరద నీరు పర్వత లోయల గుండా వేగంగా ప్రవహిస్తూ సరిహద్దు గ్రామాలపై విరుచుకుపడింది. వరద ఉధృతికి అనేక ఇళ్లు, గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పటివరకు నువాకోట్, ధాడింగ్ జిల్లాల పరిధిలో ఎనిమిది మృతదేహాలను వెలికితీసినట్లు నేపాల్ పోలీస్ అధికార ప్రతినిధి అభినారాయణ కాఫ్లే తెలిపారు. మిగిలిన మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

105 మంది భారతీయులు గల్లంతు

నేపాల్ టూరిజం బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి మొత్తం 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. వీరిలో 291 మంది విదేశీయులు కాగా 93 మంది నేపాల్ స్థానికులు ఉన్నారు. విదేశీయుల్లో అత్యధికంగా 105 మంది భారతీయ పౌరులు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా సహాయక చర్యల్లో పాల్గొనాల్సిన నేపాల్ రక్షణ బలగాలకు కూడా ఈ వరద తాకిడి తగిలింది. రసువా జిల్లాలో 26 మంది నేపాల్ పోలీసులు, 7 మంది ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది వరద నీటిలో కొట్టుకుపోయారు.

Advertisement

రాకపోకలు, విద్యుత్ సరఫరా బంద్

ఒక్కసారిగా వచ్చిన వరద వల్ల నేపాల్‌లోని రహదారులు, విద్యుత్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నాయి. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (NEA) పరిధిలోని ఆరు ప్రధాన జలవిద్యుత్ కేంద్రాలు, సబ్‌స్టేషన్లు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో నేపాల్లోని పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు పలు రోడ్లను వరద నీరు ముంచెత్తడంతో జాతీయ రహదారులపై రాకపోకలు బంద్ అయ్యాయి.

Also Read: బాహుబలి పవర్ బ్యాంక్.. ఏకంగా లక్ష mAh బ్యాటరీ.. 20 సార్లు ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు!

ప్రధాని అత్యవసర సమీక్ష

అకస్మిక వరదల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. ఆర్మీ హెలికాప్టర్లు, విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దించింది. నేపాల్ ప్రధాని బాలేంద్ర షా జాతీయ విపత్తు సంస్థతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సహాయక చర్యలను సమీక్షించారు. వైద్య బృందాలు, రెడ్ క్రాస్, స్కౌట్స్ భాగస్వామ్యంతో బాధితులకు అవసరమైన సాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. నదీ తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు.

Also Read: టీటీఈ పర్మిషన్ లేకుండా.. రైలులో రిజర్వ్ సీట్లు మార్చుకోవచ్చా? చట్టం ఏం చెబుతోంది?

Tags

Related News

కూల్ డ్రింక్స్‌లో చక్కెర ట్రిపుల్.. ప్యాకెట్లలో కొవ్వు డబుల్.. దేశాన్ని ఊబకాయం వైపు తోస్తున్న ప్యాకేజ్డ్ ఫుడ్స్!

భయపెడుతున్న హెచ్‌1ఎన్‌1 కేసులు.. మళ్లీ మాస్కులు తప్పవా?

అడవి పందితో.. 14 ఏళ్ల బాలుడి విరోచిత పోరాటం.. 90 నిమిషాలు హోరాహోరీ ఫైట్!

ఆస్పత్రిలో విచిత్రం.. సైలెంట్‌గా వచ్చి.. రూ.4 లక్షలు ఎత్తుకెళ్లిన వీధి కుక్క!

జెన్ జెడ్ ఎఫెక్ట్.. ఆపై గడ్కరీ వ్యాఖ్యలు, మోదీ కేబినెట్ విస్తరణకు సంకేతాలు, ఈసారి యువతకు ఛాన్స్

ముగ్గురు ఫ్యామిలీ సభ్యుల ఆత్మహత్యలో కొత్త కోణం, ఘటనకు ముందు వీడియో, తీగలాగితే డొంక కదిలింది

పాఠశాలల్లో హిజాబ్ కంటే.. యూనిఫామే ముఖ్యం.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

Big Stories

Advertisement
×