BigTV English

Lok Sabha Elections: ఇప్పటివరకు అత్యధిక, అత్యల్ప మెజారిటీ సాధించిన నేతలెవరో తెలుసా?

Lok Sabha Elections: ఇప్పటివరకు అత్యధిక, అత్యల్ప మెజారిటీ సాధించిన నేతలెవరో తెలుసా?

Lok Sabha Elections: ఎన్నికల్లో గెలవడం అంటే ఓ కిక్కు. అభ్యర్థులు ఒక్కోసారి అఖండ మెజారిటీతో గెలుస్తారు. కొందరేమో స్వల్ప తేడాతో ఓడిపోతారు. లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఇప్పటి వరకు ఇద్దరు నేతలు మాత్రమే సింగిల్ డిజిట్ తేడాతో గెలుపొందారు. ఇదిలా ఉంటే మరో అభ్యర్థి ఏకంగా 98 శాతం ఓట్లతో విజయం సాధించారు. ఇప్పటి వరకు ఉన్న లోక్‌సభ ఎన్నికల అత్యధిక, అత్యల్ప మెజారిటీ రికార్డు గురించి మీకు తెలుసా?


అత్యధిక మెజారిటీ:

బీజేపీ నాయకురాలు ప్రీతమ్ ముండే లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె అరుదైన ఘనత సాధించారు. మహారాష్ట్ర బీద్ ఎంపీ రోడ్డు ప్రమాదంలో మరణించగా ఆ స్థానంలో ఉపఎన్నిక నిర్వహించారు. దీంతో అక్కడ ఆయన కుమార్తె ప్రీతమ్ పోటీ చేయగా రికార్డు స్థాయిలో 6.96 లక్షల ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు.


2019 సార్వత్రిక ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు 6లక్షలకు పైగా మెజారిటీ సాధించారు. కానీ ఎవరు ప్రీతమ్ రికార్డును చేరుకోలేదు. అయితే ఈ అభ్యర్థులంతా బీజేపీ నేతలే కావడం విశేషం. గుజరాత్‌లోని నవపరిలో బీజేపీ నేత సీఆర్ పాటిల్ 6.89 లక్షల మెజారిటీతో గెలుపొందారు.

హర్యానాలోని కర్నాల్‌లో సంజయ్ భాటియా 6.56 లక్షలు, ఫరీదాబాద్ లో కృష్ణపాల్ గుజ్జర్ 6.38 లక్షలు , రాజస్థాన్ భిల్వాడాలో సుభాష్ బహేరియా 6.12 లక్షలు, 2004 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని ఆరంభాఘ్‌లో సీపీఎం నేత అనిల్ బసు 5.92 లక్షల మెజారిటీతో గెలుపొందారు.

Also Read: చారిత్రాత్మక ఎన్నికల్లో ప్రపంచ రికార్డ్.. ఓటర్లకు సీఈసీ స్టాండింగ్ అవేషన్

9 ఓట్ల తేడాతో:

భారీ మెజారిటీ సాధిస్తే గెలుపు ఏకపక్షం అవుతుంది. కానీ కొన్నిసార్లు అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో విజయం సాధిస్తారు. అలా ఇద్దరు ఎంపీలు ఇప్పటి వరకు 9 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1989 లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో అనకాపల్లి కాంగ్రెస్ అభ్యర్థి కొణతల రామకృష్ణ 9 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1998లో బీహార్ రాజ్‌మహల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సోమ్ మరండి 9 ఓట్ల తేడాతో గెలుపొందారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×