BigTV English
Advertisement

Shobana: కల్కి సినిమాతో సీనియర్ హీరోయిన్ శోభన రీఎంట్రీ.. ?

Shobana: కల్కి సినిమాతో సీనియర్ హీరోయిన్ శోభన రీఎంట్రీ.. ?

Shobana: అందం, అభినయం కలబోసిన రూపం ఆమె సొంతం. ఆమెను చూస్తే నెమలి కూడా నాట్యం చేయడం ప్రారంభిస్తుంది. ఆమె గజ్జె కడితే అవార్డులన్నీ ఆమె ఇంటికి పరిగెడుతూ వెళ్లిపోతాయి. ఆమె శోభన. ఈ పేరు ఇప్పటితరం వారికి గుర్తులేకపోవచ్చు.. కానీ, అప్పట్లో శోభన నటనకు, డ్యాన్స్ కు ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు.


నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభన, విక్రమ్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో వరుస అవకాశాలను అందుకుంది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి, వెంకటేష్‌తో అజేయుడు , మోహన్ బాబు రౌడీ గారి పెళ్ళాం లాంటి సినిమాలలో నటించి మెప్పించింది. తెలుగుతోపాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది.

నటన, డ్యాన్స్ తోనే జీవితం మొత్తం గడిపేసింది ఆమె. పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని గడుపుతున్న శోభన.. ఒక డ్యాన్స్ అకాడమీని నిర్మించి ఎంతోమందికి నాట్యాన్ని నేర్పిస్తుంది. ఇక 2006 లో మోహన్ బాబు సరసన గేమ్ అనే సినిమాలో నటించిన శోభన ఆ తరువాత తెలుగు సినిమాలో నటించింది లేదు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. శోభన రీఎంట్రీకి సిద్ధమవుతుందని తెలుస్తోంది.


ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న కల్కి2898AD సినిమాలో శోభన ఒక గెస్ట్ రోల్ లో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా మొత్తం స్టార్ క్యాస్టింగ్ తో నిండిపోయింది. కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రానా, రాజమౌళి, మృణాల్ ఠాకూర్ గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనున్నారు .

ఇక ఈ లిస్ట్ లో శోభన కూడా చేరింది. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ, ఇదే కనుక నిజమైతే శోభనకు మంచి ఛాన్స్ దొరికినట్లే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి కల్కిలో ఎవరెవరు ఉన్నారన్నది తెలియాలంటే జున్ 27 న సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×