BigTV English

BJP Party: బీజేపీ కంచుకోటలో కోలుకోలేని ఎదురుదెబ్బ

BJP Party: బీజేపీ కంచుకోటలో కోలుకోలేని ఎదురుదెబ్బ

Smriti Irani Trails Congress Candidate Kishorial Sharma In Amethi: 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. సిట్టింగ్‌ సీట్లు ఖాయంగా భావించిన బీజేపీ నాయకులకు ఊహించని షాక్ తగిలింది. బీజేపీ కంచుకోటగా భావించే ఉత్తరప్రదేశ్‌లోనూ బీజేపీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. అందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఇక్కడ 80 పార్లమెంట్‌ స్థానాలు ఉండగా, 41 స్ధానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు.


ఇక అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఆశలన్ని యూపీలోని అమేథి పార్లమెంట్ నియోజకవర్గం పైనే ఉన్నాయి. అయితే బీజేపీ తరపున బరిలో దిగిన మాజీ మంత్రి స్శృతి ఇరానీకి ఓటమి తప్పట్లేదు. కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ కంటే దాదాపు 13 వేల ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. అమేథి నుంచి గెలుపు ఖాయమని భావించిన స్శతికి ఇప్పటివరకు తన ప్రత్యర్థి కిశోరీలాల్‌ ముందంజలో ఉన్నారు.

గతంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ఓడించిన స్మృతి ఇరానీకి యూపీ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి సేమ్‌ సీన్‌ రిపీట్ అవడంతో బీజేపీ పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్లు అయింది.ఇంకో ట్విస్ట్ ఏంటంటే గతంలో కూడా బీజేపీ పార్టీ నుండి పోటీ చేసి రాహుల్ గాంధీపై గెలిచిన స్మృతి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిశోరీ లాల్ చేతిలో ఓటమికి దగ్గరగా ఉండటంతో రాజకీయ వక్తలు ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయని భావిస్తున్నారు. ఇక స్శృతి ఇరానీ గతంలో సెంట్రల్‌ మినిస్టర్‌గా పనిచేశారు.గతంలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిన రాహుల్ ఈసారి అమేథీకి బదులుగా యూపీలో మరో కీలక నియోజకవర్గమైన రాయబరేలి నుంచి పోటీలో నిలిచి గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు.


Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×