BigTV English

Who is game changer in AP: ఏపీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ ఎవరు?

Who is game changer in AP: ఏపీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ ఎవరు?

Ap elections 2024 result updates(Political news in AP): ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో టీడీపీకి పట్టంకట్టారు ఓటర్లు. కూటమి గెలుపు వెనుక అన్నిరకాల వర్గాల ప్రజలు ఉన్నారు. యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్ వాళ్లు పోషించిన పాత్ర మరువలేము. ఇంతవరకు ఓకే. మరి ఈ గెలుపు వెనుక విజయం ఎవరిది? టీడీపీ అధినేత చంద్రబాబుకు దక్కుతుందా? జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు క్రెడిట్ ఇవ్వాలా? లేక ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మెయిన్ రోలా? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.


ప్లాన్ అంతా చంద్రబాబుదే.. కాకపోతే దాన్ని సక్సెస్ చేసే బాధ్యతను ఓ వైపు పవన్‌కల్యాణ్, మరోవైపు పురందేశ్వరికి అప్పగించారన్నది తెలుగు తమ్ముళ్లు చెబుతున్నమాట. ఈ విషయంలో పవన్ చరిష్మాను తక్కువ అంచనా వేయలేము. 2014లో పవన్ వ్యాఖ్యలకు.. ఇప్పుడు స్పీచ్‌కు చాలా తేడా ఉందంటున్నా రు. ఒకప్పుడు ఆవేశంతో మాట్లాడే జనసేనాని, ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఆవేశాన్ని ప్రదర్శించడం రాజకీయాల్లో అదొక అస్త్రమని అంటున్నారు కొందరు నేతలు.

బీజేపీతో కలయిక కూడా దీనికి కారణమన్నది మరోవైపు వినిపిస్తున్నమాట. పురందేశ్వరి.. హైకమాండ్‌తో మాట్లాడి పొత్తును సక్సెస్ చేయడంలో ఆమెదీ కీలకపాత్రని అంటున్నారు. ఎన్నికల ప్రకటన తర్వాత వైసీపీ అరాచకాన్ని అడ్డుకోవడంలో టీడీపీ సక్సెస్ అయ్యింది. పేరుకే బీజేపీతో పొత్తుగానీ ప్రచారం అంతా తానై నడిపించారు చంద్రబాబు, పవన్. నాలుగైదు సభలకు మాత్రమే బీజేపీ కీలక నేతలు హాజరయ్యారు. ఈ విషయంలో క్రెడిట్ బాబుదేనని అంటున్నారు.


ALSO READ: అదో సెంటిమెంట్, జైలుకెళ్తే సీఎం ఖాయం

సూపర్ సిక్స్ పథకాలు కూడా కూటమి గెలుపుకు కారణమని అంటున్నారు. పై విషయాల్లో ఏ ఒక్కటి లేకుండా టీడీపీ గెలుపు కష్టమని అంటున్నారు. ఇది నాణెనికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు జగన్ చేసిన తప్పిదాలే కూటమి విజయానికి బాటలు వేసిందని అంటున్నవాళ్లూ లేకపోలేదు. ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్, వై నాట్ 175 స్లోగన్, మూడు రాజధానులు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టు ఉంది. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో కూటమి గెలుపు వెనుక అందరూ తమవంతు పాత్ర నిర్వహించారనే చెప్పవచ్చు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×