BigTV English

Snow Storm : అమెరికాలో మంచు విలయం.. పొంచిఉన్న వరద ముప్పు..

Snow Storm : అమెరికాలో మంచు విలయం.. పొంచిఉన్న వరద ముప్పు..
Advertisement

Snow Storm : మంచు తుపానుతో అమెరికా అతలాకుతలమైంది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న మంచుతో అమెరికా, కెనడా దేశాల్లోని చాలా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనజీవనం స్తంభించిపోయింది. నివాసప్రాంతాలు, రోడ్లపై మంచు భారీగా పేరుకుపోయింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి ఎదురైంది. మృతుల సంఖ్య పెరుగుతోంది. బఫెలో నగరంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నగరంలో 50 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. 1880 తర్వాత ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో హిమపాతం రావడం ఇదే తొలిసారి.


స్తంభించిన రవాణా వ్యవస్థ
మంచు తుపాను వల్ల రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. అనేక ప్రాంతాల్లో రహదారులను మూసేశారు. పెట్రోలు బంకులు మూతపడటంతో వాహనాలకు ఇంధనం దొరకడంలేదు. సెలవులకు బంధువుల ఇళ్లకు బయల్దేరిన వారు కార్లలోనే ఇరుక్కుపోయారు. కారు డోర్లు తెరుచుకోకపోవడంతో.. బయటకు రాలేక కొందరు అందులోనే మరణించారు. కొందరు గంటల తరబడి కార్లలోనే ఇంజిను ఆడిస్తూ ప్రాణాలు అరచేత పట్టుకుని గడిపారు. మరోవైపు అనేక విమాన సర్వీసులను రద్దు చేశారు.

రెస్టారెంట్లు, స్టోర్లు మూతపడటంతో ప్రజలు ఆహారానికి ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల కొరతతో పలుచోట్ల లూటీలు జరుగుతున్నాయి. న్యూయార్క్‌ రాష్ట్రంలోని బఫెలో నగర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. తమకు ఆహారం అందించాలని సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. అమెరికా ప్రభుత్వం మంచు తుపాను బాధితుల కోసం పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసింది. ఆ శిబిరాలన్నీ బాధితులతో నిండిపోయాయి. న్యూయార్క్‌ రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ భరోసా కల్పించారు. ఇది జీవితకాలంలో ఒకసారి వచ్చే మహా ఉత్పాతమని న్యూయార్క్‌ గవర్నర్‌ తెలిపారు.


భారీగా పెరిగిన మృతుల సంఖ్య
అమెరికాలో మంచు తుపాను బారిన పడి మంగళవారం ఉదయం వరకు 66 మంది ప్రాణాలు కోల్పోయారు. బఫెలో నగరంలోనే 34 మంది మృత్యువాతపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. మిగిలిన రాష్ట్రాల్లోనూ హిమపాతం ప్రమాదకర స్థాయిలోనే ఉంది. డెన్వర్‌, అట్లాంటా, లాస్‌వేగస్‌, సియాటెల్‌, బాల్టిమోర్‌, షికాగోలో విమాన సర్వీసులు ఆలస్యమవుతున్నాయి. కొన్ని సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. ఫ్లైట్ ‌అవేర్‌ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం సోమవారం 4000 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి.

బాంబ్‌ సైక్లోన్‌ ఎఫెక్ట్
గ్రేట్‌లేక్స్‌ ప్రాంతంలో ఏర్పడిన బాంబ్‌ సైక్లోన్‌ పెను విధ్వంసం సృష్టించింది. న్యూయార్క్‌ రాష్ట్రంలో 23 సెం.మీ. మంచు కురవచ్చని జాతీయ వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఫ్లోరిడాలో మునుపెన్నడూ లేని విధంగా చలి తీవ్రత ఉంది. అయితే ఊరట కలిగించే అంశం ఏమిటంటే ఈ బాంబ్‌ సైక్లోన్‌ బలహీనపడిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వారాంతానికి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

పొంచిఉన్న వరదముప్పు
ఉష్ణోగ్రతలు పెరిగితే ఇప్పటివరకు పేరుకుపోయిన మంచు ఒక్కసారిగా కరిగి ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా బఫెలో లాంటి ప్రాంతాలకు ఈ ముప్పు చాలా ఎక్కువని పేర్కొంది. దీంతో వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు అమెరికా ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

Tags

Related News

Mohan Babu University: హైకోర్టులో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ఊరట… విద్యా కమిషన్‌కు మొట్టికాయలు

Harish Rao On BC Reservations: కాంగ్రెస్‌తో కలిసి పోరాడేందుకు సిద్ధం: హరీశ్ రావు

OTT Movie : పెళ్ళాం ఉండగా మరో అమ్మాయితో… తండ్రే దగ్గరుండి… గుండెను పిండేసే నిహారిక విషాదాంత కథ

New Traffic Rules: అలా చేశారో లైసెన్స్ గోవిందా.. కొత్త ట్రాఫిక్ రూల్స్ తో జాగ్రత్త సుమా!

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… భర్త పై పగతో రగిలిపోయే అమ్మాయిలు… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Big Stories

×