Shiva Balaji as a Naxalite: నక్సలైట్ పాత్రలో శివ బాలాజీ

Shiva Balaji as a Naxalite: నక్సలైట్ పాత్రలో శివ బాలాజీ

Shiva Balaji as a Naxalite: నక్సలైట్ పాత్రలో శివ బాలాజీ
Share this post with your friends

Shiva Balaji as a Naxalite: శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సింధూరం. జనవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా శివ బాలాజీ మీడియాతో మాట్లాడారు. ‘‘డైరెక్టర్ శ్యామ్ తుమ్మలపల్లి సింధూరం కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. ఈ సినిమా ఇన్‌టెన్స్‌గా ఉందనిపించింది. అలాగే షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాలు చేస్తున్నప్పుడు కాంట్రవర్సీ అవుతుందేమో అనిపించింది. డైరెక్టర్ శ్యామ్ బాగా రీసెర్చ్ చేసి ఈ కథ రాసుకున్నారు. నేను మొదటిసారిగా నక్సలైట్ పాత్రలో నటించాను.

నక్సల్స్ పాయింట్‌తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నివేశాలను సింధూరం సినిమాలో చూపించాం. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. మొత్తంగా చెప్పాలంటే ఇదొక నక్సల్ ఇన్ఫార్మర్ కథ. ఒక నిజాన్ని అందరికి అర్థం అయ్యే విధంగా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.

ప్రతి ఆర్టిస్ట్ చాలా ఫోకస్‌తో సినిమా చేశారు. తమిళ్‌లో ఆల్రెడీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్రిగిడ ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. హీరో ధర్మ మహేష్ ఫస్ట్ సినిమా అయినా సరే చాలా నేచురల్‌గా చేశాడు. మంచి డైలాగ్స్ బాగా కుదిరాయి. సింధూరం లాంటి కథతో సినిమా రావాలంటే మరో 10 – 15 సంవత్సరాలు తప్పకుండా పడుతుంది. అలాంటి కథ ఇది. సంగీత దర్శకుడు హరి గౌరవ మ్యూజిక్ ఈ సినిమాకు మరో ఎసెట్ అవుతుంది’’ అన్నారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Patan Devi Temple :- పటాన్ దేవికి భయపడ్డ మొఘల్ చక్రవర్తి

Bigtv Digital

Jr Ntr:- మ‌రో కొత్త షోతో బుల్లితెర‌పై జూనియ‌ర్ ఎన్టీఆర్‌

Bigtv Digital

Argentina football team offer : అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ ఆఫర్.. తిప్పికొట్టిన భారత్..

Bigtv Digital

Revanth Reddy: రాహుల్‌గాంధీ అర్హతలు ఇవే.. కేసీఆర్‌కు రేవంత్ ఛాలెంజ్..

Bigtv Digital

Mega Brothers : మెగా బ్రదర్స్ బంధం.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్..

Bigtv Digital

Supremecourt : హైకోర్టు ఏమైనా టౌన్‌ ప్లానరా?… అమరావతి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

BigTv Desk

Leave a Comment