Big Stories

Snowfall in Himachal Pradesh: మండువేసవిలో మంచువర్షం.. కనువిందు చేస్తున్న హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి అందాలు!

Snowfall in Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మండు వేసవిలో కూడా మంచు వర్షం కురవడంతో.. అక్కడ ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. లాహూల్ స్పితి జిల్లా వ్యాప్తంగా సెంటీ మీటర్ల మేర మంచు దుప్పటి కప్పి ఉంది. కిన్నౌర్‌లోని నరకంద, మండి, కల్ప వంటి టూరిస్ట్ ప్రాంతాలు ఈ మంచు వర్షంతో మరింత సుందరంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

ఇళ్లు, రోడ్లు, దేవాలయాలు సహా పలు ప్రాంతాలు పూర్తిగా మంచుదుప్పటి కప్పుకున్నాయి. దీంతో అక్కడి దృశ్యాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. పర్యాటకులతో పాటు స్థానికులు కూడా.. మంచువర్షం కురవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలాకాలం తర్వాత వాతావరణం అనుకూలించిందని రైతులు, తోటల పెంపకందారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేడి తగ్గి మంచు వర్షం కురవడంతో ఇప్పుడు పర్యాటకుల రాకపై అంచనాలు పెరిగాయి. పర్యాటకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. మంచు పర్వతాల నుంచి అకస్మాత్తుగా మంచు పెళ్లలు విరిగిపడే ప్రమాదం ఉందని.. అడ్వెంచర్ స్పోర్ట్స్ చేస్తున్నవాళ్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

Also Read :హైదరాబాద్ లో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా

మరో మూడు రోజుల పాటు ముంచు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది. వడగళ్ళు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో తేడా కనిపిస్తోంది. కీలాంగ్‌లో 0.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రముఖ పర్యాటక కేంద్రమైన మనాలిలో 8 నుంచి 18.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News