BigTV English

Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా!

Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా!

Heavy Rain in Hyderabad:  మండుటెండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న భాగ్యనగర వాసులకు ఎట్టకేలకు కాసింత ఉపశమనం లభించింది. శనివారం ఉదయం నుంచీ వాతావరణం చల్లగా ఉండటంతో.. హమ్మయ్య అని సేదతీరుతున్నారు. ఉన్నట్టుండి ఆకాశమంతా మబ్బులు కమ్మి.. గాలి, వాన మొదలైంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.


కొత్తపేట, సరూర్ నగర్, నాగోల్, చైతన్యపురి, అంబర్ పేట, చంపాపేట, సైదాబాద్, రాజేంద్రనగర్, తుర్కయాంజల్, జూబ్లీహిల్స్, మాదాపూర్, ఫిలింనగర్, షేక్ పేట్, టోలిచౌకి, గోల్కొండ, నార్సింగి, హిమాయత్ నగర్, మణికొండ, మెహదీపట్నం, చిక్కడపల్లి, కవాడిగూడ, గచ్చిబౌలి, ముషీరాబాద్, రాం నగర్, సికింద్రాబాద్, కార్వాన్, అరాంఘర్, దుర్గానగర్, కాటేధాన్, శ్రీరామ్ కాలనీ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గాలి, వానతో నగరమంతా చల్లబడింది. యాదాద్రి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టంచింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. చెట్లు విరిగిపడ్డాయి.

సరిగ్గా ఆఫీసులు, కాలేజీలకు వెళ్లే సమయంలో వర్షం పడటంతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ఈదురుగాలుల నేపథ్యంలో కొన్నిప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ తో పాటు.. తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ వర్షం కురుస్తోంది. నిన్నటివరకు వడగాలులతో అల్లాడిపోయిన జనం.. ఇప్పుడు వాన పడటంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. వచ్చే ఐదు రోజులు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి వానలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.


Also Read: ఈ రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు.. ఏపీలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

కాగా.. శుక్రవారం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్, జమ్ముకశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో భారీవర్షాలు, వడగళ్ల వానలు కురిశాయి. వడగళ్ల వానలకు పంటలు దెబ్బతిన్నాయి.

ఇటీవలే దుబాయ్ లో కురిసిన భారీ వర్షానికి అక్కడి జనజీవనం అస్తవ్యస్థమైంది. మిట్టమధ్యాహ్నం ఆకాశమంతా కారుమబ్బులు కమ్మడంతో.. నడిరేయిని తలపించింది అక్కడి వాతావరణం. ఆ తర్వాత ఎడతెరపి లేకుండా 24 గంటలు కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు ఎక్కడిక్కడ ఇళ్లు నేలమట్టవ్వగా, వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఎడారి ప్రాంతంగా చెప్పే దుబాయ్ లో.. ఒక ఏడాది కాలంలో కురవాల్సిన వర్షం ఒక్కరోజులో కురవడం అందరినీ ఆందోళనకు గురిచేసింది.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×