Ritika Back’s Ground: ఢిల్లీ అందాల ముద్దుగుమ్మ రితికా నాయక్ మరో క్రేజీ సినిమా ఆఫర్‌ను కొట్టేసింది.

‘హనుమాన్’ హీరో తేజ సజ్జ సరసన ‘మిరాయ్’ సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది.

మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత మెల్ల మెల్లగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో కూడా రెండు సినిమాల్లో నటించింది ఈ భామ.

విశ్వక్ సేన్ నటించిన ‘అశోక వనంలో అర్జుణ కళ్యాణం’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఈ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఆ తర్వాత నాని నటించిన ‘హాయ్ నాన్న’లో కూడా కీలక పాత్రలో నటించింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘మిరాయ్’లో నటిస్తుంది.

ఈ సినిమాతో రితికా నాయక్ పేరు మారు మోగిపోవడం ఖాయమనే గుస గుసలు వినిపిస్తున్నాయి.