Royal Escort: ఈ మాస్క్ వీరుడి పేరు దినేష్ పాటిల్. వీడి ఏజ్ జస్ట్ 23 ఇయర్స్.. కానీ వీడి స్కామ్ స్కిల్స్ వేరే లెవల్.. వీడొక వెబ్‌సైట్ డిజైన్ చేశాడు. దానికి రాయల్ ఎస్కార్ట్ డాట్ కామ్ అని పేరు పెట్టాడు. పేరు మాత్రం రాయల్‌గా ఉంది. కానీ అందులో ఉండేదంతా పనికిరాని చెత్త.
ఇంటర్నెట్‌లో అందమైన అమ్మాయిల ఫోటోలు కనిపిస్తే చాలు కొందరి అబ్బాయిల మనసు ఎగిరి గంతేస్తుంది. దీన్ని క్యాచ్ చేసి క్యాష్‌గా మలుచుకున్నాడు ఈ దిక్కుమాలిన దినేష్‌గాడు. ఖతర్నాక్ వెబ్‌సైట్ డిజైన్ చేసి.. అందులో వయ్యారాలు వొలకబోసే అమ్మాయిల ఫోటోలు పోస్ట్ చేశాడు. దాని కింద బుక్ నౌ బటన్ ఆప్షన్ ఇచ్చాడు. కాల్ గర్ల్ సర్వీస్ అంటూ ఆఫర్స్ పెట్టాడు. ఇక అబ్బాయిల వేలు మౌస్ మీద వాలిపోయి క్లిక్ చేస్తే చాలు వాళ్లు చిక్కులో పడినట్లే.. చూసుకొద్దీ అప్సరసలు స్క్రీన్‌పై క్యూకడతారు. ఏదో ఒక పిక్ దగ్గర ఆగి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే.. ఆ తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ అంటూ ఆప్షన్ ఉంటుంది. తర్వాత స్పెషల్ ట్యాక్స్ అంటూ నానా రకాల నాటకాలు ఆడి బాధితుల అకౌంట్లు ఖాళీ చేస్తాడు. బయటకు తెలిస్తే పరువు పోతుందని బాధితులు సైలెంట్‌గా ఉండిపోవడంతో వీడికి అడ్డు అదుపులేకుండా పోయింది.
Also read: వందల ఏళ్ల రాజభవనం.. అప్పులపాలైన రాజవంశం… వైభవం నుంచి పతనం వరకు కంటతడి పెట్టించే మాస్టర్ పీస్
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోనే ఉంటూ ఈ కథ అంతా నడిపించాడు దినేష్‌గాడు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలానికి చెందిన ఓ వ్యక్తి కూడా ఈ వెబ్‌సైట్ తెరిచాడు. అంతే అందమైన అమ్మాయి ఫోటో చూసి టెంమ్ట్ అయ్యాడు. రిజిస్ట్రేషన్ ఫీజుతో మొదలుపెడితే మొత్తం 4 లక్షల 20 వేల రూపాయలు పే చేశాడు. అమ్మాయి వస్తుందని గంపెడు ఆశతో గుమ్మం వైపు చూశాడు.. డోర్ బెల్ మోగలేదు కానీ బ్యాంక్ మెసేజ్ మోగింది. మీ అకౌంట్ బ్యాలెన్స్ జీరో అని ఫోన్ నవ్వింది. ఆ షాక్‌లో ఉండిపోకుండా బాధితుడు పోలీసుల తలుపు తట్టాడు. బేల పోలీసులు కేసు ఓపెన్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్‌తో వెత్తుకుంటూ ఉదయ్‌పూర్‌లోని దినేష్ ఇంటికి వెళ్లారు. అక్కడి వాడి కాలర్ పట్టుకొని ఆదిలాబాద్ తీసుకువచ్చారు.
ఇది ఒక్క ఊరి కథ కాదు. దేశవ్యాప్తంగా వీడి వెబ్‌సైట్‌పై 220 మంది బాధితులు కంప్లైంట్ చేశారు. అందులో తెలంగాణలోనే ఇరవై మంది ఉన్నారు. పరువు పోతుందని బయటకు రానివాళ్లు ఇంకెంతమంది ఉన్నారో వాడికే తెలియాలి. ఇంత పెద్ద నెట్‌వర్క్ ఒక్కడితోనే నడిచిందా? వెనుక ఇంకెవరైనా ఉన్నారా? బాధితుల నుంచి వసూలైన డబ్బు ఎక్కడికి వెళ్లింది..? బ్యాంక్ అకౌంట్లు ఎవరివి? ఈ వెబ్‌సైట్ బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారు.. ఈ ఆన్సర్స్ కోసమే పోలీసుల ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అందం చూపించి డబ్బులు అడిగితే… అది ఆఫర్ కాదు బ్రదర్ ఫ్రాడ్ గేమ్‌ని తెలుసుకోండి.
Also read: ఐస్‌క్రీమ్‌కు బదులుగా ఈ కొరియన్ డెజర్ట్ ట్రై చేయండి.. టేస్ట్ అమోఘం!