E-Paper
Advertisement

DPDP చట్టంపై సుప్రీంలో విచారణ.. జర్నలిస్టుల గోప్యత, స్వేచ్ఛపై కేంద్రానికి నోటీసులు!

DPDP చట్టంపై సుప్రీంలో విచారణ.. జర్నలిస్టుల గోప్యత, స్వేచ్ఛపై కేంద్రానికి నోటీసులు!
Advertisement

Supreme Court: డిజిటల్​ పర్సనల్​ డేటా ప్రొటెక్షన్​ (డీపీడీపీ) -2023 యాక్ట్​ లోని కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ డిజిటల్​ న్యూస్​ పబ్లిషర్స్​ అసోసియేషన్​ (డీఎన్‌పీఏ) దాఖలు చేసిన పిటిషన్​ పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు పత్రికా స్వేచ్ఛకు, సమాచార హక్కుకు, పరిశోధనాత్మక జర్నలిజానికి ఆటంకం కలిగిస్తాయని డీఎన్‌పీఏ తన పిటిషన్​ లో పేర్కొంది. దీనిపై స్పందించాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

డీపీడీపీ చట్టంలో వార్తా సేకరణ, సంపాదకీయ కార్యకలాపాలు, పరిశోధనాత్మక జర్నలిజానికి ఆటంకం కలిగించే నిబంధనలు ఉన్నాయని డీఎన్‌పీఏ తన పిటిషన్​ లో పేర్కొంది. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై వార్తలు రాసే సమయంలో సంబంధిత వ్యక్తుల నుంచి అనుమతి తీసుకోవాల్సి వస్తే జర్నలిస్టుల పని క్లిష్టమవుతుందని తెలిపింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఇతర వ్యక్తులకు సంబంధించి ప్రజా ప్రయోజన అంశాలపై వార్తలు సేకరించే సమయంలో ప్రతి సందర్భంలోనూ ముందస్తు అనుమతి తీసుకోవడం సాధ్యం కాదని తెలియచేసింది.

Advertisement

ముఖ్యంగా ప్రత్యక్ష ప్రసారాలు, వేగంగా వార్తలు అందించాల్సిన సందర్భాలు, అవినీతి ఆరోపణలపై పరిశోధనాత్మక కథనాల విషయంలో ఈ నిబంధనల వల్ల సమస్యలు ఎదురవుతాయని డీఎన్‌పీఏ పేర్కొంది. చట్టంలోని కొన్ని నిబంధనల వల్ల వార్తా సంస్థలు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, వినియోగించడం, భద్రపరచడం వంటి అంశాల్లో అదనపు బాధ్యతలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. వ్యక్తుల అనుమతి తీసుకోవడం, వ్యక్తిగత సమాచారాన్ని తొలగించాలన్న అభ్యర్థనలను పరిశీలించడం వంటి నిబంధనలు పరిశోధనాత్మక కథనాల ప్రచురణను ప్రభావితం చేస్తాయని తెలిపింది. అవినీతి లేదా ఇతర ప్రజా ప్రయోజన అంశాలపై సమాచారం అందించే వ్యక్తుల వివరాలు బయటపడే ప్రమాదం ఉందన్న ఆందోళనను వ్యక్తం చేసింది.

ప్రభుత్వానికి సమాచారాన్ని కోరే అధికారం కల్పించే నిబంధనలు జర్నలిస్టుల సమాచార వనరుల గోప్యతపై ప్రభావం చూపవచ్చని డీఎన్‌పీఏ తన పిటిషన్ లో అభిప్రాయపడింది. డిజిటల్ డేటా రక్షణ చట్టంతోపాటు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)లోని సెక్షన్ 8(1)(జే) సవరణను కూడా డీఎన్‌పీఏ సవాలు చేసింది. వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించడంపై ఈ నిబంధన విధించే పరిమితులు ప్రభుత్వ అధికారులు, ప్రజా వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని పొందడంలో ఇబ్బందులు కలిగించవచ్చని పేర్కొంది.

Advertisement

Also Read: హోమ్ లోన్ టెన్యూర్ ఎంత ఉండాలి? తక్కువ ఈఎంఐ బెటరా? త్వరగా తీర్చేయడం మంచిదా?

వ్యక్తిగత గోప్యతను పరిరక్షించడం ఎంత ముఖ్యమో.. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం కూడా అంతే ముఖ్యమని తెలిపింది. ఈ రెండు హక్కుల మధ్య సమతుల్యత అవసరమని పేర్కొంది. చట్టంలోని వివాదాస్పద నిబంధనలను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని, వాటి అమలుపై మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని డీఎన్‌పీఏ కోరింది. పిటిషన్​ లోని అంశాలపై స్పందనను తెలియచేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణను వాయిదా వేసింది.

Also Read: దీపావళి వేళ గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఆభరణాలు కొనకుండానే.. పసిడిపై లాభాలు పొందే 5 మార్గాలు!

Tags

Related News

టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు.. ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ఫైర్!

బ్యాలెట్ పేపర్లలోనూ కాంగ్రెస్‌కు సున్నా.. ప్రధాని మోదీ సంచలన కౌంటర్!

సినిమా స్టయిల్‌లో ప్రియుడితో కలిసి భర్తను లేపేందుకు స్కెచ్.. కీలక అంశాలు వెలుగులోకి

ప్రజలకు విజయ్ ప్రభుత్వం బిగ్ షాక్.. ఆటో ఛార్జీలు, పాల ఉత్పత్తుల ధరలు పెంచుతూ నిర్ణయం!

టాటా గ్రూపును నాశనం చేశారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యల వెనుక

అర్నబ్ తుఫాను ప్రభావం.. తమిళనాడు-పుదుచ్చేరిలో భారీ వర్షాలు

డిజిటల్ అరెస్టుల వ్యవహారం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు, ఉక్కుపాదం మోపాలని ఆదేశం

జడ్జి కొడుకు యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్.. కొచ్చి పోలీస్ కమిషనర్‌పై వేటు.. కారణం ఏంటంటే?

Big Stories

Advertisement
×