Big Stories

Weather Updates: నేడు, రేపు కూడా వర్షాలు కురుస్తాయి: వాతావరణ శాఖ

Rain Forecast: రాష్ట్రంలో మంగళవారం భారీగా వర్షాలు కురిశాయి. అయితే, ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు ఇది కొంత ఉపశమనం కలిగించినా కొన్ని చోట్లా మాత్రం వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి ఇళ్ల రేకులు, పైకప్పులు కొట్టుకుపోయాయి. ఇంకొన్ని చోట్లా రోడ్లపై విద్యుత్ స్తంబాలు, ట్రాన్స్ ఫార్మార్లు, చెట్లు విరిగిపడ్డాయి. పాతఇండ్లు కూడా కూలిపోయినట్లు తెలుస్తోంది.

- Advertisement -

చాలా చోట్లో రోడ్లపై భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఇంకొన్ని చోట్లా వడగండ్ల వర్షం కురవడంతో రైతులు భారీగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట ఎకరాల్లో నష్టపోయారు. మరికొన్ని చోట్లా అమ్మేందుకు సిద్ధం చేసిన ధాన్యం పూర్తిగా తడిసిముద్దయ్యింది. కళ్లముందే పంట నష్టం వాటిల్లడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు చోట్లా వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. అత్యధిక ఉష్ణోగ్రతలతో ఇప్పటికే అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలను భారీ వర్షం రూపంలో అతలాకుతలం చేసింది.

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షపాతం నమోదవగా.. అత్యధికంగా హైదరాబాద్ లోని మియాపూర్ లో 13. 3 శాతం నమోదవగా, ఏటురునాగారంలో 4.4 శాతం వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. అయితే, నేడు, రేపు కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని, ఇంకొన్ని చోట్లా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షం కురిసే సమయంలో భారీగా ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు, రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Also Read: ఎక్కడెక్కడ ఎంత శాతం వర్షం కురిసిందంటే..?

ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏదైనా సమస్య ఎదురైతే తమకు తెలియజేయాలని సూచిస్తున్నారు. కాగా, వర్షం కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచించిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News