Digital Arrest Scam: సైబర్ నేరగాళ్ల డిజిటల్ అరెస్టులపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. అది సాధారణ నేరం కాదని, వాటిని పాల్పడుతున్నవారిని డిజిటల్ దోపిడీదారులను నిర్దాక్షిణ్యంగా శిక్షించాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ తరహా మోసాలు జరుగుతుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆయా నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించింది. సైబర్ నేరాన్ని డిజిటల్ దోపిడీగా పేర్కొన్న న్యాయస్థానం, కేసుల ఏకీకరణకు మాత్రం నిరాకరించింది.
దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఒక చోట చేర్చాలని నిందితుల వేసిన పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్‌లు జయమల్య బాగ్చి, మోహనలతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్ విచారణ సందర్భంగా కీలక వ్యాక్యలు చేసింది. నిందితుల సౌలభ్యం కోసం బాధితులను ఇబ్బంది పెట్టలేమని తేల్చేసింది. వాటిపై స్వతంత్ర దర్యాప్తు కొనసాగు తుందని తేల్చి చెప్పేసింది. డిజిటల్ అరెస్టులంటే డిజిటల్ దోపిడీనని అభిప్రాయంగా ప్రస్తావించింది.
వీడియో కాల్స్ ద్వారా ఆ తరహా నేరాలకు పాల్పడుతున్నారని, వారికి కఠిన శిక్షలు పడాల్సిందేనని స్పష్టం చేసింది. విచారణకు ముందు వారిని శిక్షించేందుకు చట్టంలో ఏదైనా అవకాశం ఉంటే దాన్ని ఉపయోగించాలని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. డిజిటల్ అరెస్టుల ద్వారా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సైబర్ నేర దందాలను తీవ్రంగా ఖండించింది. కేరళలోని ఎర్నాకుళంకు చెందిన 81 ఏళ్ల వృద్ధుడిని మోసం చేసి దాదాపు రూ. 1.90 కోట్లు దళారీ ఖాతాలో జమ చేశారని పేర్కొంది.
ALSO READ: జడ్జి కొడుకు యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్.. కొచ్చి పోలీస్ కమిషనర్‌పై వేటు.. కారణం ఏంటంటే?
వివిధ రాష్ట్రాల్లో దర్యాప్తులకు ఆటంకం కలిగించడానికి నిందితులు అలాంటి విచారణను ఉపయోగించుకోవడానికి నిరాకరించింది. కేసుల ఏకీకరణ కోరుతున్న నిందితుల సౌలభ్యం కోసం బాధితులు ఢిల్లీకి ఎందుకు ప్రయాణించాలని ప్రశ్నించారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ, గుజరాత్‌తో సహా పలు రాష్ట్రాల్లో నిందితులపై సైబర్ నేరాలకు సంబంధించిన 35 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.