E-Paper
Advertisement

BRS చేసిన రంకును మాకు అంటగడతారా? హరీష్, KTRలకు మంత్రి ఘాటు కౌంటర్!

BRS చేసిన రంకును మాకు అంటగడతారా? హరీష్, KTRలకు మంత్రి ఘాటు కౌంటర్!
Advertisement

Ponguleti Srinivas: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. సెక్రటేరియేట్‌లో మీడియా ముఖంగా రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రతిపక్ష BRS నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ సచివాలయం వేదికగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి.

అమిత్ షా పర్యటనపై ఘాటు వ్యాఖ్యలు

Advertisement

వచ్చే నెల 2వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానుండటంపై మంత్రి పొంగులేటి తీవ్రంగా స్పందించారు. ‘కుప్పలు ఏరుకునేవాడు పరిగెలు ఏరుకోవడానికి వచ్చినట్లు ఉంది అమిత్ షా పర్యటన’ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తున్నాయనే నెపంతోనే కేంద్ర నేతలు రాష్ట్రానికి వస్తున్నారని ఆరోపించారు.

BRS నేతలకు స్ట్రాంగ్ కౌంటర్

Advertisement

గులాబీ పార్టీ నేతలు హరీష్ రావు, కేటీఆర్‌ల వైఖరిపై పొంగులేటి మండిపడ్డారు. ‘గతంలో ప్రజల నోళ్లు మూయించి, చేతులకు సంకెళ్లు వేసింది BRS ప్రభుత్వమే. వారు చేసిన తప్పులు, రంకును ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. BRS నేతలు మాట్లాడుతున్న మాటలు చాలా దురదృష్టకరమని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఓట్ల తొలగింపుపై ‘ఇండియా’ కూటమి సమరం

కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకుని SIR పేరుతో దొంగదారిన ఓట్లను తొలగిస్తోందని మంత్రి ఆరోపించారు. దీనిపై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే గత రెండేళ్లుగా పోరాటం చేస్తున్నారని, ఇప్పుడు ఓట్ల తొలగింపు నిజమేనని తేలిపోయిందని అన్నారు. కేంద్రం, ఈసీ నిద్రపోతున్నట్లు నటిస్తున్నాయని ధ్వజమెత్తారు.

నవంబర్ 1న దేశవ్యాప్త ఆందోళనలు

కార్యకర్తల ప్రయాణానికి రైళ్ల కేటాయింపులో కేంద్రం ఇబ్బందులు పెడుతోందని, రైల్వే అనేది బీజేపీ సొత్తు కాదని స్పష్టం చేశారు. కేంద్రం చేస్తున్న అరాచకాలను ఒక్కొక్కటిగా బట్టబయలు చేస్తామన్న పొంగులేటి, తొలగించిన ఓట్లను పునఃపరిశీలించి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. దీనికి నిరసనగా నవంబర్ 1న ఇండియా కూటమి ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

Also Read: ఏపీలో అర్నాబ్ తుఫాను బీభత్సం.. ఐదుగురు మృతి, పలు జిల్లాల్లో భారీ నష్టం!

Tags

Related News

ఎస్టీపీ ప్లాంట్లలో AI టెక్నాలజీ.. నీటి వినియోగంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు!

ఉపాధి పనులపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ..!

కరువు పై తప్పుడు ప్రచారం చేస్తే.. చెప్పుల దండ వేసి గాడిదపై ఊరేగిస్తాం!- చానగాని దయాకర్

తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్యాయత్నం.. చాకచక్యంగా కాపాడిన సైఫాబాద్ పోలీసులు!

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. 9 మంది అధికారులకు కొత్త బాధ్యతలు!

రైళ్లు ఆపగలరేమో.. ఢిల్లీ రాకుండా ఆపలేరు! మహేష్ కుమార్ గౌడ్ సవాల్

కాప్రాలో సైబర్ కేటుగాళ్ల పంజా.. వ్యాపారి ఫోన్ హ్యాక్ చేసి రూ.30 లక్షలు స్వాహా!

Big Stories

Advertisement
×