North Korea Death Punishment| నిర్లక్ష్యంగా పనిచేసి వేయి మందికి పైగా ప్రజలు చనిపోయిందుకు కారణమైన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఉరి శిక్ష విధించింది. వీరిలో ఇప్పటికే 20 మందికి పైగా ఉద్యోగులకు శిక్ష అమలు కూడా చేసేశారు. ఈ ఘటన ఉత్తర కొరియాలో జరిగింది.
ఉత్తర కొరియా శాసకుడు, డిక్టేటర్ కిమ్ జొంగ్ ఉన్.. ఈ కఠిన శిక్ష ఆదేశాలు ఇటీవలే జారీ చేశారని దక్షిణ కొరియా మీడియా తెలిపింది. ఉత్తర కొరియా దేశంలోని చాగాంగ్ రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాల కొండచరియలు విరిగిపడడం, ఇళ్లు కూలిపోవడంతో భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. వేల మంది నిరాశ్రయులయ్యారు. వేయి మందికి పైగా చనిపోయారని, వేల సంఖ్యలో గాయపడిన వారున్నారని మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి.
ఇంతటి భారీ ఉపద్రవం జరిగిన నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే తీవ్ర ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో ఉత్తర కొరియా ప్రభుత్వం బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు జాతీయ మీడియా చానెల్ చోసున్ టీవి తెలిపింది.
చోసున్ టీవి రిపోర్ట్ ప్రకారం.. ప్రకృతి వైపరీత్యం సంభవించిన తరుణంలో నష్ట నివారణ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి తీవ్ర ప్రాణ నష్టం జరగడానికి కారణమైన అధికారులు కఠిన శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
ఆ తరువాత కొరియా నియంత శాసకుడు కిమ్ జొంగ్ ఉన్ బాధ్యులైన అధికారులకు మరణ శిక్ష విధించారని రిపోర్ట్ లో చోసున్ టివి పేర్కొంది. ఆగస్టులో 20 నుంచి 30 మంది ప్రభుత్వ అధికారులకు ఉరిశిక్ష అమలు చేశారని సమాచారం. అయితే ఆ ప్రభుత్వ అధికారులెవరో పూర్తి వివరాలు వెల్లడించలేదు.
ఉత్తర కొరియాలో తీవ్ర పరిణామాల విషయాలు బహిర్గతం చేయడానికి ప్రభుత్వ అనుమతించదు. జూలై నెలలో చైనా సరిహద్దుల ఉన్న చాజాంగ్ రాష్ట్రంలో సంభవించిన భారీ వరదల కారణంగా వేల మంది చనిపోయారు. ఇంతమంది చనిపోకుండా ముందుజాగ్రత్త తీసుకోవడంలో ప్రభుత్వ ఉద్యోగులు విఫలమయ్యారు. వీరందరిపై ఆగస్టు నెలలో విచారణ సాగించి ఉరి శిక్ష విధించారు. ఆ తరువాత కిమ్ జొంగ్ ఉన్ మరణ శిక్ష విధించారు. ఈ వ్యవహారమంతా మీడియా ముందు బహిర్గతం చేయలేదు.
Also Read: కుక్కతో దాడి చేయించి హత్య.. బాయ్ ఫ్రెండ్ కూతురిని చంపిన సైకో లేడి!
అయితే మరణ శిక్ష పడిన వారిలో చాజాంగ్ రాష్ట్ర పార్టీ సెక్రటరీ ‘కాంగ్ బోంగ్ హూన్’ కూడా ఉండడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాంగ్ బోంగ్ హూన్ ఇంతకుముందు ప్రభుత్వంలో ఆయుధాల విభాగంలో డెప్యూటీ డైరెక్టర్ గా పనిచేశారు.
నార్త్ కొరియాలో జూలై లో సంభవించిన వరదల్లో 4100 ఇళ్లు కూలిపోయాయి. 7410 వ్యవసాయ భూమి, రోడ్లు, రైల్వే లైన్లు నాశనమయ్యాయి. వేయి మందికి పైగ చనిపోయారు. ఈ ఘటనతో సినియూజు నగరం, ఉయిజు పట్టణాలు దాదాపు సగానికి పైగా వరదల్లో కొట్టుకుపోయాయి.
Also Read: బ్రెజిల్ లో సోషల్ మీడియా ‘ఎక్స్’ పై నిషేధం.. మస్క్‌పై న్యాయమూర్తి పగబట్టారా?