BigTV English

Supreme court: వైద్యులకు సుప్రీంకోర్టు సూచన, తక్షణమే విధుల్లోకి రావాలంటూ..

Supreme court: వైద్యులకు సుప్రీంకోర్టు సూచన, తక్షణమే విధుల్లోకి రావాలంటూ..

Supreme court to doctors(Today latest news telugu): ఆందోళన చేస్తున్న వైద్యులు విధులకు హాజరుకావాలని సూచన చేసింది సుప్రీంకోర్టు. మీ ఆందోళన కారణంగా పేదలు నష్టపోకూడదని, వెంటనే విదుల్లోకి రావాలని ఆదేశించింది. మీపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది.


దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. విచారణ జరువుతున్న సుప్రీంకోర్టు ధర్మాసనానికి స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసింది సీబీఐ. సీల్ కవర్‌లో రిపోర్ట్‌ను అందజేసింది. కేసు దర్యాప్తు పురోగతిని నివేదికలో ప్రస్తావించింది.

ఇదిలావుండగా ఆందోళన చేస్తున్న డాక్టర్లు విధులకు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డ్యూటీ చేస్తూనే ఆందోళన చేస్తున్నామని వైద్య సంఘాలు తెలిపాయి. విధులకు హాజరైనప్పటికీ క్యాజువల్ లీవ్ కట్ చేసి వేధిస్తున్నారని వెల్లడించాయి. తొలుత విధులకు హాజరుకావాలని సూచించింది సీజేఐ ధర్మాసనం. వైద్యులు పని చేయకపోతే ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఎలా నడుస్తుందని సూటిగా ప్రశ్నించింది.


ALSO READ: ట్రైనీ హత్యాచార ఘటనపై దీదీ వర్సెస్ అభిషేక్..సుప్రీంకోర్టులో సీబీఐ స్టేటస్ రిపోర్టు దాఖలు!

ఆసుపత్రుల్లో వసతులు ఏ విధంగా ఉంటాయో తాము అర్థం చేసుకోగలమన్నారు సీజేఐ. గతంలో ఓసారి మిత్రుడ్ని చూడ్డానికి వెళ్లి ఓ రాత్రి అక్కడే పడుకున్నానని, అక్కడి పరిస్థితులను కళ్లతో చూడాల్సి వచ్చిందన్నారు. నేషనల్ టాస్క్‌ఫోర్స్‌లో రెసిడెంట్ డాక్టర్లను చేర్చాలని ఆయా సంఘాలు కోరాయి.

రెసిడెంట్ డాక్టర్ల సమస్యలను నేషనల్ టాస్క్‌ఫోర్స్ వింటుందని సీజేఐ భరోసా ఇచ్చారు. కమిటీలో భాగస్వాములుగా ఉండడానికి, కమిటీ ఎదుట వాదన చెప్పడానికి తేడా ఉంటుందన్నది డాక్టర్ల తరపు న్యాయవాదుల వెల్లడించారు. ఒక్కోసారి వైద్యుల డ్యూటీ 48 గంటల పాటు ఉంటుందన్నారు.

ఈ స్థితిలో వైద్యుడి మానసిక, శారీరక స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనివేళలు, వర్కింగ్ కండిషన్‌పై ఎన్టీఎఫ్ దృష్టి సారిస్తుందన్నారు. ఎన్టీఎఫ్‌లో ఉన్న వైద్యులు ఈ స్థితిని దాటి వచ్చినవారేనని, వర్కింగ్ కండిషన్స్, ఇతర సమస్యల గురించి తెలుసన్నారు.

సీబీఐ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్ పరిశీలించింది సుప్రీంకోర్టు. ఘటన జరిగిన ఐదో రోజు దర్యాప్తు మా చేతికి అందిందని సొలిసిటర్ జనరల్ వెల్లడించారు. అప్పటికే చాలావరకు మార్చేశారని వివరించారు. ప్రతి ఒక్కటీ వీడియోగ్రఫీ జరిగిందని, మృతదేహానికి అంత్యక్రియలు జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని బెంగాల్ ప్రభుత్వం తరపు న్యాయవాది కపిల్ సిబాల్ తెలిపారు. సీనియర్ డాక్టర్లు, సహచరులు ఒత్తిడి చేయడంతో వీడియోగ్రఫీ చేశారని, అంటే అక్కడ కవరప్ ఏదో జరుగుతుందని వారంతా భావించారన్నారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×