BigTV English

Kolkata Doctor Case: ట్రైనీ హత్యాచార ఘటనపై దీదీ వర్సెస్ అభిషేక్..సుప్రీంకోర్టులో సీబీఐ స్టేటస్ రిపోర్టు దాఖలు!

Kolkata Doctor Case: ట్రైనీ హత్యాచార ఘటనపై దీదీ వర్సెస్ అభిషేక్..సుప్రీంకోర్టులో సీబీఐ స్టేటస్ రిపోర్టు దాఖలు!

Kolkata Doctor Case Mamata vs Abhishek(Telugu breaking news): కోల్‌కతా హత్యాచార ఘటనపై ఆ పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ బదిలీపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి.


ట్రైనీ డాక్టర్ హత్యాచారం నిరసన కార్యక్రమాలకు అభిషేక్ బెనర్జీ దూరంగా ఉంటున్నాడు. అలాగే ఈ కేసును విచారిస్తున్న సీబీఐకి త్వరితగతిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాడు. అలాగే సీఎం మమతా బెనర్జీ చేపట్టి ర్యాలీలు, పాదయాత్రకు పాల్గొనకుండా నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై వివాదం కొనసాగుతోంది.

మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సస్పెండ్ విషయంపై తృణమాల్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అసహనం వ్యక్తం చేసినట్లు వార్తాలు వస్తున్నాయి. ఇన్ని పరిణామాలు జరుగుతున్న సమయంలో మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చురుగ్గా కనిపించడం లేదని, ఆ పార్టీలో అంతర్గతంగా లుకలుకలున్నాయని వార్తలు వస్తున్నాయన్నారు.


అలాగే , ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిపై ఆరోపించిన అవినీతి చర్యలపై సరైన చర్యలు తీసుకోలేదని, ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే వైద్యుల బృందం.. మాజీ ప్రిన్సిపాల్ ఘోష్‌కు మద్దతు ప్రకటించాయి. ప్రస్తుతం ఈ బృందం అవినీతి ఆరోపణలపై పరిశీలిస్తుంది. అయితే ఇలాంటి తరుణంలో పార్టీ పేరును కాపాడుకునేందుకు కఠిన నిర్ణయాలు అవసరమని అభిషేక్ బెనర్జీ భావించినట్లు తెలుస్తోంది.

అంతకుముందు ఆస్పత్రిపై దుండగులు దాడి చేసిన తర్వాత మమత వ్యాఖ్యలకు భిన్నంగా అభిషేక్ బెనర్జీ పోలీస్ కమిషనర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఇదిలా ఉండగా, అభిషేక్ బెనర్జీకి సన్నిహితుడు మాజీ రాజ్యసభ ఎంపీ శాంతను సేన్‌పై కక్ష్య సాధింపులకు కారణమని మమతా బనర్జీ ఆరోపించారు. దీంతో ఆమెను ఎన్ఆర్ఎస్ ఆస్పత్రి పదవి నుంచి తొలగించారు. అయితే బాధ్యులను శిక్షించాలని అభిషేక్ కోల్‌కతా పోలీసులను కోరారు. కానీ, ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ మమతా బెనర్జీ ర్యాలీ చేపట్టగా.. ఈ కార్యక్రమానికి అభిషేక్ హాజరుకాలేదు.

కాగా, అభిషేక్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. ఇదే విషయమే ఇద్దరి మధ్య విభేదాలకు కారణమని తెలుస్తోంది. మరోవైపు, దీదీ నాయకత్వం మేము పోరాడుతామని, అభిషేక్ నాయకత్వం వహించాని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం బెంగాల్ లోని డైమండ్ హార్బర్ స్థానం నుంచి అభిషేక్ బెనర్జీ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ తృణమూల్ కు దీదీ వారసుడిగా పేరుంది. కానీ పార్టీకి క్లిష్ట సమయంలో అభిషేక్ మౌనంగా ఉండడంతోపాటు మమతా బెనర్జీ చేపట్టే కార్యక్రమాలకు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: ప్రముఖ హీరో కీలక ప్రకటన.. పార్టీ జెండా ఆవిష్కరణ

ఇదిలా ఉండగా, కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. అదే విధంగా సీబీఐ, బెంగాల్ పోలీసులు తమ స్టేటస్ రిపోర్టును సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టులో దాఖలు చేశాయి.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×