E-Paper
Advertisement

నన్ను సీఎం అనకండి.. మైక్ బంద్ చేస్తా.. సభలో కార్యకర్తలపై బండి సంజయ్ ఫైర్!

నన్ను సీఎం అనకండి.. మైక్ బంద్ చేస్తా.. సభలో కార్యకర్తలపై బండి సంజయ్ ఫైర్!
Advertisement

Bandi Sanjay: నిర్మల్లో బీజేపీ మహా పాదయాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. బండి సంజయ్ మాట్లాడుతుండగ బీజేపీ కార్యకర్తలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేసారు. దీంతో నన్ను సీఎం అంటే మైక్ బంద్ చేస్తానని బండి సంజయ్ అన్నారు. అలా అనకండి అంటూ పార్టీ శ్రేనులను బండి సంజయ్ కోరారు. SIR అంటేనే అనర్హుల ఓట్లను తొలగించడం అని అన్నారు. అర్హత ఉన్న వాళ్లకు ఓటు ఉంచడమే SIR లక్ష్యం అని, ఎపుడో మరణించిన మాజీ ప్రధాని పీవీ ఓటు కూడా ఇంకా ఉందని అన్నారు.

నెహ్రూ కాలంలో SIR..

చనిపోయిన వారి ఓట్లు తీసేస్తే చోరీ అవుతుందా.. రెండు, మూడు చోట్ల ఓట్లున్న వారివి తీసేయడం తప్పు ఎలా అవుతుందని బండి సంజయ్ అన్నారు రాహుల్ ముత్తాత నెహ్రూ కాలంలో కూడా SIR జరిగింది. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పాలనలో కూడా SIR జరిగిందని, అప్పుడు కాంగ్రెస్ పార్టీనే చేపట్టిన విషయం రాహుల్ మర్చి పోవద్దు అని బండి సంజయ్ అన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ వాళ్ళు ఇక్కడి ప్రధానిని నిర్ణయించలేరని అన్నారు.

బట్టలు ఊడదీసి కోడతాం..

Advertisement

సోషల్ మీడియాలో మాపై దుష్ప్రచారం చేస్తున్న వారిని బట్టలు ఊడ కొడతాం అని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఈ దేశం కానోడికి, అక్రమంగా వచ్చినోడి ఓటు తప్పకుండా తొలగిస్తామని బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ ఇలాగే మాట్లాడితే NRC కూడా అమలు చేస్తామని, అవసరం అయితే దేశంలో ఉన్న అక్రమంగా వలసొచ్చిన పరాయి దేశస్తులను తరిమి కొడతామని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also read: ఖైరతాబాద్ ఉపఎన్నిక సస్పెన్స్.. దానం నాగేందర్ వర్సెస్ పి. విజయారెడ్డి న్యాయపోరాటంలో గెలుపెవరిది?

Tags

Related News

జీడీమెట్ల సర్కిల్‌లో దారుణం.. పారిశుధ్య కార్మికులను వేదిస్తున్న సూపర్వైజర్!

2014 నుంచి దేశానికి దరిద్రం.. అమిత్ షాకు ఎంపీ చామల చురకలు!

ఆ ఒక్క తప్పుతో.. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ వల్ల తెలంగాణకు లక్ష కోట్ల నష్టం?

మురసు తుఫాన్ ఎఫెక్ట్‌.. తెలంగాణలో భారీ వర్షాలు, పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్

గిరిజన మహిళపై వేటేస్తే.. మరి మీ సంగతేంటి? శ్రీధర్ బాబు టార్గెట్‌గా ఎంపీ వంశీకృష్ణ సెటైర్లు!

సుకన్య రెడ్డి పేరిట ఫేక్ ప్రొఫైల్.. ట్రేడింగ్ యాప్‌లో కానిస్టేబుల్‌కు రూ.30 లక్షల టోకరా!

రెవెన్యూ, ఫారెస్ట్ భూములపై కీలక నిర్ణయం.. ఏళ్ల నాటి సమస్యకు మంత్రి పొంగులేటి మాస్టర్ ప్లాన్!

Big Stories

Advertisement
×