Big Stories

Tamilnadu Rains : చెన్నైలో భారీ వర్షాలు.. ఏడు జిల్లాల్లో విద్యాసంస్థలు బంద్..

Tamilnadu Rains : దక్షిణ భారతదేశంలో అక్టోబర్ 29న ఈశాన్య రుతుపవనాలు అడుగుపెట్టాయి. దీంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. చెన్నై శివారులో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఉత్తర శ్రీలంక తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది.

- Advertisement -

ఈశాన్య రుతుపవనాల వర్షాల కారణంగా రానున్న ఐదు రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. చెన్నైతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగళపట్టు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆరంజ్ అలెర్ట్ జారీ చేసి.. ఏడు జిల్లాలలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News