E-Paper
Advertisement

పసి పిల్లలపై తాంత్రికుడి పైశాచికత్వం.. శ్మశానం సమీపంలో ఏం చేశాడంటే.. బీహార్‌లో వెలుగు చూసిన దారుణం

పసి పిల్లలపై తాంత్రికుడి పైశాచికత్వం.. శ్మశానం సమీపంలో ఏం చేశాడంటే.. బీహార్‌లో వెలుగు చూసిన దారుణం
Advertisement

Bihar: మంత్రాలకు చింతకాయలు రాలే రోజులు పోయాయి.. అదంతా గతం. కాలం మారింది.. మనుషుల ఆలోచన తీరు మారింది. టెక్ యుగంలోనూ అలాంటి మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు మాంత్రికులుగా చెప్పుకునే కొందరు వ్యక్తులు. చిన్నారులకు చికిత్స పేరుతో కొందరు మాంత్రికులు చేస్తున్న ఆగడాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారానికి సంబంధించి వీడియో వెలుగులోకి రావడం, పోలీసులు అతడిపై కేసు నమోదు చేయడం చకచకా జరిగింది.

పసిపిల్లలపై ఓ తాంత్రికుడి పైశాచికత్వం

బీహార్‌లోని సీతామర్హి ప్రాంతంలో చికిత్స పేరుతో చిన్నారులపై చేస్తున్న అరాచకాలకు సంబంధించి దిగ్భ్రాంతి కరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మహాదేవపట్టి గ్రామంలో వెలుగుచూసింది. నార్మల్‌గా చిన్న వయస్సులో పిల్లలకు రకరకాల సమస్యలు వస్తుంటాయి. ఆ గ్రామంలోని శ్మశాన వాటిక సమీపంలో చిన్నారుల అనారోగ్యాన్ని నయం చేస్తానని అక్కడి ప్రజలను నమ్మించాడు. ఎరుపు రంగు దుస్తులు ధరించిన ఆ తాంత్రికుడు చిన్నారులను తీవ్రంగా హింసించిన వీడియో వైరల్‌గా మారింది.

బీహార్‌లో షాకింగ్ ఘటన.. రంగంలోకి పోలీసులు

Advertisement

తాంత్రికుడు మంత్రాలు ఉచ్చరిస్తూ పసికందులను కాళ్లు-చేతులు పట్టుకుని గాల్లో వేగంగా గిరగిరా తిప్పుతూ కనిపించింది. ప్రజల్లో భయాన్ని కలిగించడానికి వారిని నేలపై విసిరికొట్టడం కనిపించింది. క్రూరమైన ఘటనకు పలువురు చిన్నారులు స్పృహ తప్పి కదల్లేక నేలపై నిర్జీవంగా పడిపోయారు. ఇంత జరుగుతున్నా గుడ్డి నమ్మకంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు.. ఆ దుర్మార్గాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. వాటి నుంచి బయట పడలేక పిల్లలను కూడా ఆ తాంత్రికుడి వద్దకు తీసుకురావడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఓ తాంత్రికుడి వీడియోపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం మొదలైంది. ఈ వ్యవహారంపై సీతామర్హి జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు.

ALSO READ: విమర్శలు ఏ మాత్రం పట్టించుకోను.. నా జీవితాశయం అదే, తేల్చిచెప్పిన పీఎం నరేంద్రమోదీ

Advertisement

పోలీసుల వివరాల మేరకు.. ఆ తాంత్రికుడ్ని శ్రవణ్ మహతో గా గుర్తించారు. ఆ గ్రామానికి చెందిన రాస్ నారాయణ్ మహాతో కొడుకు అతడు. ఓ అధికారి ఫిర్యాదు ఆధారంగా శ్రవణ్ మహతోపై కేసు నమోదు చేశారు. బాలల న్యాయ పరిరక్షణ చట్టం-2015 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక కుటుంబం తమ పిల్లలను చికిత్స కోసం మంత్రగాడి వద్దకు ఎందుకు తీసుకువెళ్తున్నారు? అనారోగ్యానికి మూఢనమ్మకాలు కలిసినప్పుడు ప్రజలు ఇలాంటి పద్ధతులను ఆశ్రయిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం జరిగిన ఘటనలో అదే జరిగిందని అంటున్నారు. ప్రస్తుతం ఆ తాంత్రికుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. చిన్నారులపై ఈ హింస గడిచిన నాలుగేళ్లుగా కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు.

Related News

విమర్శలు ఏ మాత్రం పట్టించుకోను.. నా జీవితాశయం అదే, తేల్చిచెప్పిన పీఎం నరేంద్రమోదీ

సీఎంగా మొదలై ప్రధానిగా.. 25 ఏళ్ల మోదీ ప్రస్థానంపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!

మద్యం మత్తులో యువతి హంగామా.. సిటీ బస్సులో హల్చల్, చెన్నైలో ఘటన

ట్రైనింగ్ విమానానికి తప్పిన ముప్పు, పంట పొలాల్లో ల్యాండింగ్, కర్ణాటకలో ఘటన

ఉత్తరాదిని వణికించిన భూకంపం.. రోడ్ల మీదకు ఢిల్లీ ప్రజలు, ఉత్తరాఖండ్‌లో భూకంప కేంద్రం

ఢిల్లీలో హైటెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!

స్కూళ్లలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరి చేయలేం.. సుప్రీంకోర్టు సంచలనం!

Big Stories

Advertisement
×