BigTV English

Hamas Arsenal : ఆయుధ కోటపై హమాస్, హిజ్బుల్లా

Hamas Arsenal : ఆయుధ కోటపై హమాస్, హిజ్బుల్లా

Hamas Arsenal : స్వల్ప వ్యవధిలో 5 వేల మిస్సైళ్లతో విరుచుకుపడటం హమాస్‌కు ఎలా సాధ్యపడింది? హమాస్, హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థలు ఆయుధాలను సమకూర్చుకోగలుగుతున్నాయి? హమాస్ మిలిటెంట్లు అయితే వాటర్ పైపులతో రాకెట్లను ఎలా తయారు చేసుకుంటున్నామో వివరిస్తూ ఏకంగా వీడియోలను షేర్ చేస్తున్నారు.


గత కొన్నేళ్లుగా ఎలాంటి దాడులు, కవ్వింపులకు పోకుండా.. ఆయుధాల తయారీలో సుశిక్షితులయ్యేందుకే ఇంతకాలం పరిమితమైనట్టు ఈ వీడియోలు చెప్పకనే చెబుతున్నాయి. ఆయుధ తయారీలో రిసెర్చి చేసే దశకు వారి నైపుణ్యం చేరిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. డ్రోన్లు, నీళ్లలో పయనించే అన్‌మ్యాన్డ్ వెహికల్స్ తయారీతో పాటు సైబర్ యుద్ధం చేయడంలోనూ ఆరితేరినట్టు యుద్ధ నిపుణులు చెబుతున్నారు.

అన్‌గైడెడ్ రాకెట్ల నుంచి జీపీఎస్ ఆధారంగా పనిచేసే డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యాన్ని హమాస్ మిలిటెంట్లు సంతరించుకున్నారని జెరూసలేం సెంటర్ పబ్లిక్ ఎఫైర్స్ అభిప్రాయపడింది. పశ్చిమాసియాలో ఆయుధాల అక్రమ రవాణాను హమాస్, హిజ్బుల్లా తదితర ఉగ్రవాద సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి.


హమాస్ ఇప్పటికే పలు దేశాల నుంచి ఆయుధాలను సమకూర్చుకున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ నుంచి 107ఎంఎం రాకెట్లు, 12-40 కిలోమీటర్ల రేంజి కలిగిన 122 ఎంఎం రాకెట్లను వేర్వేరు దేశాల నుంచి హమాస్ పొందగలిగింది. 43 నుంచి 74 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగల ఫజర్ 3, 5 రాకెట్లను ఇరాన్ నుంచి హమస్ మిలిటెంట్ల చేతుల్లోకి వచ్చాయి. ఇక 180 కిలోమీటర్ల రేంజి గల ఎం302 క్షిపణులను సిరియా నుంచి సమకూర్చుకున్నారు.

హిజ్బుల్లా వద్ద కూడా ఆయుధాల సంఖ్య తక్కువేమీ లేదు. ఆ ఉగ్రవాద సంస్థ వద్ద ఉన్న మిస్సైళ్లు, రాకెట్లలో అధిక భాగం ఇరాన్, సిరియా, రష్యా, చైనాలో తయారైనవే. భూతలపోరులో సాయపడగల రాకెట్లు, యాంటీ ట్యాంక్, యాంటీ షిప్, యాంటీ ఎయిర్ మిస్సైళ్లు వంటి ఆయుధాలు హిజ్బుల్లా వద్ద ప్రస్తుతం లక్ష వరకు ఉన్నట్టు అంచనా.

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×