Big Stories

Manipur : మణిపూర్ లో అమిత్ షా పర్యటన .. అల్లర్లు కంట్రోల్..

Manipur : మణిపూర్ లో ఘర్షణలు అదుపులోకి వచ్చాయి. ఆదివారం రాష్ట్రం అల్లర్లతో అట్టుడికింది. ఆ రోజు జరిగిన ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలుకోల్పోయారు. దీంతో తాజా ఘర్షణల్లో మరణించినవారి సంఖ్య ఐదుకు చేరింది. కానీ సోమవారం నుంచి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. మరోవైపు ఇంఫాల్‌ లోయలో సైన్యం, పారామిలిటరీ బలగాలు కూంబింగ్‌ కొనసాగిస్తున్నాయి. మిలిటెంట్లు అపహరించిన ఆయుధాల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

- Advertisement -

మణిపూర్ లో మే 3న జాతుల ఘర్షణలు మొదలయ్యాయి. ఇప్పటివరకు 80 మంది మరణించారు. ఇంకోవైపు భద్రతా బలగాల కాల్పుల్లో 40 మంది మిలిటెంట్లు హతమయ్యారు. ప్రస్తుతం మణిపూర్‌లో 10 వేల మంది సైనికులను కేంద్రం మోహరించింది. వీరితోపాటు పారా మిలిటరీ బలగాలను రంగంలోకి దించింది.

- Advertisement -

ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మణిపూర్ లోనే ఉన్నారు. సోమవారం రాత్రి ఇంఫాల్‌ కు చేరుకున్నారు. జూన్‌ 1 వరకు రాష్ట్రంలోనే ఉంటారు. అధికారులతో సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో తాజా పరిస్థితిపై సమీక్షిస్తారు.

మహిళలు, పిల్లలను కవచాలుగా వాడుకుని గ్రామాలపై దాడులు చేయాలన్న మణిపూర్‌ మిలిటెంట్ల కుట్రను సైన్యం భగ్నం చేసింది. ఇటీవల మిలిటెంట్ల కమ్యూనికేషన్‌ వ్యవస్థలోకి స్థానికంగా ఉన్న సైన్యానికి చెందిన స్పియర్‌ కోర్‌ కమాండ్‌ చొరబడింది. అక్కడ వారి సంభాషణల ట్రాన్స్‌స్క్రిప్ట్‌ను కనిపెట్టింది. ఇందులో భద్రతా బలగాలను అడ్డుకునేందుకు అమాయక పౌరులను వాడుకోవాలనే ప్రణాళికలపై మిలిటెంట్లు చర్చించినట్లు గుర్తించింది. ప్రజలను కవచాలుగా వాడుకుని మే 27 నాటికి ఓ గ్రామాన్ని ధ్వంసం చేయాలన్న కుట్ర బయట పడింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News