BIG BREAKING: కశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ యుద్ధం స్టార్ట్ చేసింది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడలు చేసింది. పాక్ తో పాటు పీవోకేలోని తొమ్మిది ప్రాంతాలను గుర్తించి దాడులు చేసినట్టు భారత రక్షణ శాఖ ప్రకటించింది. అటు పీవోకే లోని కోట్లి, ముజఫరాబాద్, బహవల్ పూర్ లో భారత్ ఆర్మీ అటాక్ చేసిందని పాక్ ఆర్మీ ధ్రువీకరించింది.
భారత్, దాయాది దేశం పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పీవోకే లో భారత్ బాంబుల మోత షురూ చూసింది. ముజఫరాబాద్ కొండల సమీపంలో భారీ శబ్దాలు వినిపిస్తున్నట్టు అక్కడి స్థానికులు వెల్లడించారు. స్థానిక గ్రిడ్ స్టేషన్ పై మిస్సైల్ అటాక్ జరిగిందని.. దీంతో ప్రాంతమంతా కరెంట్ పోయిందని వారు చెప్పారు. దీంతో ముజఫరాబద్, కోట్లి ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.
Pakistan pic.twitter.com/XuGFEMYjat
— Mossad Commentary (@MOSSADil) May 6, 2025
ఉగ్రవాదులను అంతమొందించడమే లక్ష్యంగా భారత్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అలాగే పాక్ లోని ఉగ్రవాదులు, పీవోకేలోని లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మి మెరుపులు దాడులు చేసింది. ఉగ్రవాద స్థావరాలు ఉన్న ప్రాంతాల్లో ఆర్మీ మిస్సైల్స్ తో విరుచుకపడుతోంది. దీంతో స్థానిక ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారు. ‘ఆపరేషన్ సింధూర్’ అనే పోస్టుతో జస్టిస్ ఈజ్ సర్వ్ డ్ జై హింద్ అని ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది. వార్
Happy Diwali Pakistan 🎇
Indian Army 🔥 Jai Hind 🇮🇳#OperationSindoor #IndiaPakistanWar #Pakistan #jayhind pic.twitter.com/w6JhCkQxj4— voice of bharatvarsh (@voiceofbharatva) May 6, 2025
ఈ సందర్భంగా భారత రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఉగ్రవాద శిబిరాలనే భారత్ ఆర్మీ లక్ష్యంగా చేసుకుందని.. పాక్ ఆర్మీపై దాడులు చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది. లక్ష్యాల ఎంపిక, అమలులో ఆర్మీ అత్యంత సంయమనం పాటించిందని తెలిపింది. ఈ రోజు మధ్యాహ్నం దాడులకు సంబంధించిన పూర్తి వివరాలన వెల్లడిస్తామని పేర్కొంది.
అయితే, పాక్ మాత్రం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘస్తోంది. తాజాగా కశ్మీర్ లోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లో పాక్ ఆర్మీ కాల్పులు జరిపినట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది. అయితే పాక్ ఆర్మీకి ధీటు సమాధానం ఇచ్చినట్టు భారత్ ఆర్మీ వెల్లడించింది.