Gandhi Ji with Kohli : ఐపీఎల్ సీజన్ ప్రారంభమై 18 ఏళ్లు అవుతుంది. అయితే వాటిలో కొన్ని టీమ్ లు మాత్రమే కప్ సాధించాయి. మిగతా టీమ్ లు కప్ కొట్టలేదు. దాదాపు ఐదు టీమ్ లు టైటిల్ సాధించలేదు. టైటిల్ సాధించని టీమ్ లో ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ముందంజలో ఉంది. ముఖ్యంగా మూడు సార్లు ఫైనల్ కి వెళ్లిన ఈ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవడం లేదు. ఈ సారి అయినా గెలుస్తుందని అభిమానులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
Also Read : Hardik Pandya: గుజరాత్ తో హార్దిక్ పాండ్యా ఫిక్సింగ్..ఒకే ఓవర్ లో 11 బంతులు, 18 పరుగులు !
ఆ వీడియోలో మహాత్మగాంధీ వచ్చి విరాట్ కోహ్లీకి టైటిల్ అందించినట్టు.. 18 ఏళ్ల తరువాత ఆర్సీబీ టైటిల్ గెలిచిందని గాంధీ విరాట్ కోహ్లీతో మాట్లాడినట్టు ఓ వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు ఆ వీడియోను ఏఐ టెక్నాలజీతో ఈ వీడియోని క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ కప్ అందుకోవడంతో అభిమానులు సోషల్ మీడియాలో సంబురాలు చేసుకుంటున్నారు. చెన్నై, బెంగుళూరు మధ్య కుస్తీ పోటీలు జరిగాయని, అందులో కోహ్లీ సేన గెలిచిందని వీడియో క్రీట్ చేసి వైరల్ చేస్తున్నారు. మరోవైపు కర్ణాటకలో ఆర్సీబీ ప్లే ఆప్స్ కి వెళ్లడంతోనే ఓ మేకను బలి ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ముగ్గురు కోహ్లీ అభిమానులను అరెస్ట్ చేయడం గమనార్హం. ఈ సారి ఆర్సీబీ కప్ గ్యారెంటీ అని పలువురు పేర్కొంటున్నారు. ఆర్సీబీ జట్టు ఈ సారి అయినా కప్ సాధిస్తుందో.. మునుపటి మాదిరిగానే ఫైనల్ నుంచి నిష్క్రమిస్తుందోనని అందరూ ఊహించుకుంటున్నారు.
ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 11 మ్యాచ్ లు ఆడితే ఆ జట్టు 8 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఒకవేళ ఇవాళ ముంబై ఇండియన్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధిస్తే.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ జట్టు 11 మ్యాచ్ లు ఆడి 8 మ్యాచ్ ల్లో విజయం సాధించి అగ్రస్థానంలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సీజన్ లో ఆర్సీబీ, గుజరాత్, పంజాబ్, ముంబై ఇండియన్స్ దాదాపు ప్లే ఆప్స్ కి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. అగ్ర స్థానం కోసం పలు జట్లు పోటా పోటీగా ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ఏ స్థానంలో ఉన్నప్పటికీ ప్లే ఆప్స్ కి వెళ్లిన తరువాత ఇక ఫైనల్ కి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న జట్లు ప్లే ఆప్స్ లో.. ఫైనల్ లో విజయం సాధిస్తేనే టైటిల్ దక్కుతుంది.
ఇక నుంచి ప్రతీ మ్యాచ్ లో గెలిచిన జట్టునే టైటిల్ ఎగురేసుకుపోతుంది. కొన్ని జట్లు ముందంజలో ఉండటంతో ప్లే ఆప్స్ లో మాత్రం కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. ప్లే ఆప్స్ లో విజయం సాధించకపోయినప్పటికీ టాప్ 2 లో ఉన్న జట్లు మాత్రం ఓడిపోయినప్పటికీ ఎలిమినేటర్ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టుతో మరో అవకాశం ఉంటుంది. ఈ సారి మరీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ సాధిస్తే.. విరాట్ కోహ్లీ అభిమానులు ఎగిరి గంతేస్తారు. ఒకవేళ ఆర్సీబీ టైటిల్ గెలవకపోతే మాత్రం సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోలింగ్స్ చేయడం మాత్రం పక్కా.
?igsh=MXFzeXdoMmt0M3lobQ%3D%3D